ETV Bharat / sukhibhava

చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే! - gums bleeding infection

Gums Bleeding Problem : చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. ఈ సమస్యకు బ్రషింగ్, వాపు లాంటివి కొన్ని కారకాలుగా చెప్పొచ్చు. మరి.. ఈ చిగుళ్ల సమస్యను ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

gums-bleeding-problem-bleeding-while-brushing-and-prevention
చిగుళ్ల నుంచి రక్తస్రావం సమస్య
author img

By

Published : Jul 7, 2023, 7:53 AM IST

Gum Bleeding Prevention : దంతాల నుంచి రక్తం కారడం.. ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. బ్రష్ చేసేటప్పుడు లేదా పుకిలించినప్పుడు చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుండటం చాలా మందిలో చూడొచ్చు. పళ్లు తోముకుంటున్నప్పుడు, ఉమ్మేస్తున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం వస్తుంటుంది. అయితే ఇది చిగుళ్ల అనారోగ్యానికి సూచన కావొచ్చని దంతవైద్యులు చెబుతున్నారు. చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్య నుంచి బయటపడేందుకు దంతవైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ఈ రోజుల్లో పెరుగుతోంది. ఇంతకుముందుతో పోలిస్తే ఆరోగ్యంపై శ్రద్ధ ఇప్పుడు ఎక్కువవుతోంది. కరోనా తర్వాత చాలా మంది అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు, తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శరీర ఆరోగ్యం, చర్మ సౌందర్యం మీద దృష్టి పెడుతున్నారు. కానీ నోటి ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ చూపించడం లేదు. దంతాలతో పాటు నాలుక, చిగుళ్ల వంటి వాటిని శుభ్రంగా ఉంచుకుంటేనే నోరు శుభ్రంగా ఉంటుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు వస్తే దంతాలు పుచ్చిపోయి, ఊడిపోవడమే కాకుండా చిగుళ్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.

పొద్దున లేవగానే నేరుగా బాత్ రూమ్​కు వెళ్లి పళ్లు తోముకోవడం చాలా మందికి అలవాటు. అలా కాకుండా నోటి శుభ్రత గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓరల్, హైజినిక్ రూల్స్ పాటించకపోతే ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. నోట్లో బ్యాక్టీరియాల వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల రక్తస్రావం జరుగుతుంది. నోట్లో దంతాల మధ్య పాచి పుట్టడం వల్ల చిగుళ్ల వాపు ఏర్పడుతుంది. నోట్లో బ్యాక్టీరియాను తొలగించకపోవడం వల్ల చిగుళ్ల వాపుతో పాటు రక్తస్రావం జరగుతుంది. పళ్లు తోముకునేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారితే అది బ్రష్ చేసుకోవడం వల్లేనని అపోహ పడొద్దు. చిగుళ్ల అనారోగ్యం వల్లే రక్తం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మధుమేహం సమస్యతో బాధపడేవారు, ఎక్కువ ఒత్తిడికి గురయ్యేవారు, సిరోసిస్ వ్యాధికి గురైనవారిలో ఈ చిగుళ్ల సమస్య సాధారణంగా కనిపిస్తుంది.

చిగుళ్ల నుంచి రక్తం కారుతుందంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోవాలని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ ఎమ్ ప్రసాద్ అన్నారు. ప్రతిరోజూ 2 నుంచి 3 నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలని ఆయన చెప్పారు. ఉదయంతో పాటు రాత్రిపూట భోజనం చేశాక కూడా బ్రష్ చేసుకోవాలని సూచించారు. దీని వల్ల దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలు, పాచి తొలగిపోతాయని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. తిన్న తర్వాత కాసిన్ని నీళ్లు నోట్లో వేసుకొని పుకిలించడం గానీ లేదా బ్రష్ చేయడం గానీ అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు.

దీర్ఘకాల ఇన్ఫెక్షన్స్ తో ప్రమాదం..
Gums Bleeding Infection : దంతాలు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల క్రమంగా పళ్ల మీద గార ఏర్పడి గట్టిగా తయారై, సున్నితమైన చిగుళ్లకు హాని కలిగిస్తాయి. తద్వారా రక్తస్రావానికి కారణం అవుతుంది. పళ్ల మధ్యలో బ్రష్ చేరలేని చోట ఉండే గారను తొలగించడానికి ఫ్లాసింగ్ చేసుకోవాలి. చిగుళ్లకు ఇన్ఫెక్షన్ సోకి దీర్ఘకాలం కొనసాగినట్లయితే చిగుళ్లు, వాటికి ఆధారం ఇచ్చే దవడ ఎముకలు కూడా పాడైపోయే అవకాశం ఉంది. దీన్ని జింజువైటిస్ అంటారు.

ఈ సమస్య ఉన్నవారికి బ్రష్ చేసుకునే సమయంలో రక్తస్రావం కావొచ్చు. ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉండటాన్ని ఫెరియో డాంటైటిస్ అంటారు. దీని కారణంగా చిగుళ్లలో పుండ్లు ఏర్పడతాయి, దంతాలు దూరంగా జరుగుతాయి. బ్రష్ చేసుకున్నప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది.

రాత్రుళ్లు బ్రష్ తప్పనిసరి..
Gums Bleeding Causes : "చిగుళ్ల నుంచి రక్తం వస్తోందంటే దానికి రెండే కారణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఉండటం లేదా హార్డ్ బ్రషింగ్. గట్టిగా ఉన్న బ్రష్​తో పళ్లు తోముకున్నప్పుడు చిగుళ్ల మీద ఒత్తిడి కలిగి అవి కిందకు జారిపోతాయి. చిగుళ్ల సమస్య ఉంటే వెంటనే దగ్గర్లోని దంత వైద్యుడ్ని కలిసి క్లీనింగ్ చేయించుకోవాలి. రాత్రిపూట నిద్రపోయే ముందు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి. ఆ తర్వాత మంచి నీళ్లు తప్ప ఇంకేమీ తీసుకోవద్దు. అప్పుడప్పుడు మౌత్ వాష్ లు వాడుతుండాలి. ఇవి కొనే స్థోమత లేనివారు కల్లుప్పును గోరు వెచ్చటి నీటిలో వేసి పుకిలిస్తూ ఉండాలి. దీని వల్ల మొదటి దశలో ఉండే ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. అలాగే బ్రష్ చేసుకున్న తర్వాత 30 సెకన్ల పాటు చిగుళ్ల మసాజ్ చేయాలి. దీని వల్ల మిగిలిపోయిన పాచి కూడా పోతుంది. హార్డ్ బ్రష్​కు బదులుగా సాఫ్ట్ బ్రష్ ను వాడాలి. దంతాలకు బలం చేకూర్చే సమతుల ఆహారం తీసుకోవాలి. సిగరెట్, పొగాకు వంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి" అని డాక్టర్ ఎమ్ ప్రసాద్ సూచించారు.

చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.