రోజంతా పనులతో అలసిపోయే మహిళలు సమయానికి ఏదో ఒకటి తిని కడుపు నింపుకొంటే సరిపోదు. దాని వల్ల ఆకలి తీరుతుందే కానీ శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. కంటి సమస్యలు మొదలు ఎనీమియా(Anemia Disease) వరకూ ఎన్నింటినో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే మీరు తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..
అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాట్లు, ప్రొటీన్లు, పీచు పుష్కలంగా ఉంటాయి. రోజూ చారెడు గింజలను వేయించి తినడం వల్ల ఐరన్ వృద్ధి చెందుతుంది. నీరసం, నిస్సత్తువ దరిచేరవు. కళ్లకు మంచిది.
- బచ్చలికూరలో ఐరన్, విటమిన్ బి9, ఫైబర్, బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ కె1లు, యాంటీఆక్సిడెంట్లు విస్తారం. మహిళలు బచ్చలిని ఇగురు, పప్పు లేదా పచ్చడి రూపంలో తరచూ తినడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు. అలసటను దూరం చేస్తుంది.
- సోయాబీన్స్‌లో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియంలు ఉంటాయి. ఎముకలను దృఢంగా ఉంచే మంచి పోషకాహారమిది.
- ఐరన్, విటమిన్ బి9, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న పెసలు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచివి. మొలకలు(Sprouts Benefits) తినడం మరీ శ్రేష్ఠం.
- పెరుగులో ఉండే విటమిన్ బి12, క్యాల్షియం ఎముకల పటిష్టతకు దోహదం చేస్తాయి. రోగనిరోధక శక్తినీ పెంచుతాయి. కానీ పెరుగును రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచి వేసుకున్నట్లయితే పోషకాలన్నీ నశిస్తాయి.
- మెంతిలో ఐరన్, విటమిన్ సి విస్తృతంగా ఉన్నందున రక్తహీనత(Anemia Disease) పేషెంట్లను కూడా త్వరగా కోలుకునేలా చేస్తుంది. ఇందులో పీచు కూడా అధికమే.
ఇదీ చదవండి:కండరాలు బలంగా ఉండాలంటే ఇవి తినండి!