శ్వాసకోశ సమస్యలకు ముఖ్య కారణమైన బ్యాక్టీరియా, వైరస్లు ఊపిరితిత్తుల్లో, స్వరపేటికలో చేరి దగ్గు, జలుబు, ఫ్లూ, సైనసైటిస్, ఆస్తమా పెంచడం చేస్తాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు మంచి చిట్కా.. ఈ తమలపాకు ఔషధం.
కావల్సినవి..
తమలపాకు, వెల్లుల్లి, లవంగాలు, ఇంగువా, అల్లం, మిరియాలు, తేనె, బెల్లం
ఇలా చేయాలి..
ముందుగా ఓ తమలపాకు తీసుకోవాలి. వెల్లుల్లి తీసుకుని దాన్ని ముక్కలుగా చేయాలి. అల్లం ముక్క లేదా శొంఠి పొడి(మూడు చిటికెలు) తీసుకొని తమలపాకులో వేయాలి. మూడు మిరియాలు తీసుకోవాలి. కొంచెం ఇంగువా కూడా అందులో కలపాలి. బెల్లం, తేనె తగినంతగా తీసుకోవాలి. రాక్ సాల్ట్ కూడా అందులో వేయొచ్చు. అనంతరం తమలపాకును పాన్‌లా చుట్టి ఆకుపైభాగంలో లవంగం గుచ్ఛాలి. ఔషధాలు అన్ని వేసిన ఈ పాన్‌ను బాగా నమిలి రసాన్నంతా తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని చిట్కాలు..
శ్వాసకోశ సమస్యలున్నవారు ఉదయం లేవగానే తులసి ఆకులు తినాలి. మిరియాలు, శొంఠి డికాషన్ తాగాలి. విటమిన్ సీ ఫుడ్స్ తీసుకోవాలి. వేడినీటితోనే స్నానం చేయాలి. ప్రాణాయామ చేయాలి. వీటితోపాటు ఈ తమలపాకు ఔషధం తీసుకుంటే శ్వాసకోశ సమస్యల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:ఉదయం పూట ఎక్కువగా తినండి.. లేకపోతే!