ETV Bharat / sukhibhava

సంతానం లేని వారు జీడిపప్పు తింటే.. పిల్లలు కలుగుతారా? - సంతానానికి జీడిపప్పు మంచిదేనా

Cashew nut is good for pregnancy: జీడిపప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి. శరీరానికి కావాల్సిన క్యాల్షియం, ఐరన్​, జింక్​, మెగ్నీషయం లాంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే, ఈ జీడిపప్పును సంతానం లేనివారు తీసుకుంటే పిల్లలు కలుగుతారా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Eating Cashew Nuts for Pregnancy
సంతానం లేని వారు జీడిపప్పు తింటే.. పిల్లలు కలుగుతారా?
author img

By

Published : Feb 6, 2022, 2:36 PM IST

Cashew nut is good for pregnancy: జీడిపప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు, లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని రోజూ మన ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ జీడిపప్పును సంతానం లేనివారు తీసుకుంటే పిల్లలు కలుగుతారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇందులో నిజమెంత? నిపుణుల మాటేంటి? జీడిపప్పులో ఎలాంటి పోషకాలు ఉంటాయి?

జీడిపప్పులో ఉండే పోషకాలు

  • జీడిలో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువ.
  • విటమిన్‌ ఇ, కె, బి6 పుష్కలం.
  • క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కూడా మెండు

జీడిపప్పు- ఆరోగ్య ప్రయోజనలు

  • జీడిపప్పు తినడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
  • జీడిపప్పులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడతాయి.
  • కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి కూడా దీనిని డైట్‌లో చేర్చుకుంటే ఫలితం కనిపిస్తుంది.
  • హృద్రోగాల ముప్పును నివారిస్తాయి.
  • ఉడికించిన మాంసంలో ఉండే ప్రొటీన్‌కు సమానంగా జీడిపప్పులోనూ ప్రొటీన్‌ ఉంటుంది.
  • జీడిపప్పులోని కాపర్‌ బుద్ధి కుశలతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.
  • మెగ్నీషియం, మాంగనీస్‌ కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
  • వేయించుకుని లేదంటే, గ్రైండ్‌ చేసుకుని తింటే జీడిపప్పు సులభంగా జీర్ణమవుతుంది.
  • మధుమేహ రోగులు, టైప్‌-2 డయాబెటిస్‌తో బాధపడేవారు జీడిపప్పు తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

సంతానం లేని వారు జీడిపప్పు తింటే?

జీడిపప్పును ఎవరు తినాలి అనే అంశంపై స్పెయిన్‌ శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా సంతానం లేని వారు తినడం వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నట్లు వారి విశ్లేషణలో తేలింది. వారి ప్రకారం.. జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్‌ వంటి డ్రైఫ్రూట్స్‌ను రోజూ గుప్పెడు తీసుకోవడం ద్వారా వీర్యకణాలు వృద్ధి చెంది.. వాటి కదలికలు చురుగ్గా ఉంటాయి. వీర్యకణాల వృద్ధి అంతిమంగా సంతాన సాఫల్యానికి మార్గమని వారు చెబుతున్నారు.

ఇదీ చూడండి: Barley water: బార్లీ భలే పోషకం- శారీరక, మానసిక ఒత్తిడి దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.