ETV Bharat / sukhibhava

Drumstick Leaves Powder Benefits : ఈ పొడి తింటే మరింత యవ్వనంగా కనిపించడం ఖాయం! - తెలుగులో మునగాకుతో ఆరోగ్య ప్రయోజనాలు

Drumstick Leaves Powder Benefits : మనలో చాలామందికి ఆరోగ్యం మీద, అలాగే అందం మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఇలాంటి వారికి అనేక రకాలుగా ఉపయోగపడే ఒకే ఒక్క పొడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Health Benefits Of Drumstick Leaves Powder
Drumstick Leaves Powder Benefits In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 4:15 PM IST

Drumstick Leaves Powder Benefits : ఇటీవలి కాలంలో చాలామంది తమ ఆరోగ్యంతో పాటు అందం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నారు. ఇలాంటి వారికోసమే మునగాకు పొడి ఎంతో ఉపయోగపడుతుంది. మునగ చెట్టులో అనేకమైన పోషకాలు ఉంటాయి. చాలామంది మునగకాయలను ఆహారంలో తీసుకుంటారు. ఆకులను కూడా ఆయుర్వేదంలో వివిధ చికిత్సల్లో వాడుతుంటారు. మునగను ముక్కలుగా కోసి కూరల్లో వేసుకుంటారు. వీటివల్ల రుచితో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.

Drumstick Leaves Benefits : మునగ పొడి తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం దగ్గర్నుంచి చర్మ పరిరక్షణ( Health Benefits Of Drumstick Leaves )కు వరకు మునగ పొడి ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. మరి ఇన్ని లాభాలు చేకూర్చే మునగపొడితో కలిగే ఆరు ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..

బరువు తగ్గుదల..!
Drumstick Leaves Weight Loss : మునగపొడిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల కడుపు నిండిన, ఆకలి తీరిన భావన కలుగుతుంది. ఫలితంగా అతిగా ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు మునగపొడి రక్తపోటును నియంత్రిస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది..!
Drumsticks Leaves Stress Relief : మునగ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే మునగ పొడి శరీరంలోని వాపుల్ని నివారిస్తుంది. కణాలను పాడవ్వకుండా కాపాడుతుంది. ఫలితంగా తీవ్రమైన అనారోగ్యాల బారిన పడకుండా కూడా మనల్ని కాపాడుతుంది.

శక్తిని అందిస్తుంది..!
Drumstick Leaves Energy Powder : మునగ పొడిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల శరీరానికి కావాల్సినంత శక్తి దొరుకుతుంది. రోజంతా మరింత చురుగ్గా ఉండేందుకు ఈ మునగ పొడి దోహదం చేస్తుంది.

మెరుగైన జీర్ణక్రియ..!
Drumstick Leaves Digestion : మునగలోని పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. ఇది జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. పేగుల్లో కదలికలు మెరుగుపడతాయి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది..!
Drumstick Leaves Immunity Booster : శరీర సమగ్ర ఆరోగ్యానికి రోగనిరోధక శక్తి చాలా ముఖ్యం. మునగ పొడిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇవి అనారోగ్యాల బారిన పడకుండ కూడా కాపాడుతుంది. ఏదైనా అనారోగ్యం వచ్చినా త్వరగా కోలుకునేందుకు మునగ పొడి సహాయపడుతుంది.

చర్మం, కురులు మరింత ఆరోగ్యంగా..!
Drumstick Leaves For Skin : మునగ పొడిలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. మునగ పొడిని ఆహారంలో తీసుకోవడం వల్ల చర్మం, కురులకు ( Drumstick Leaves Powder For Hair ) కూడా చాలా మేలు జరుగుతుంది. చర్మం కాంతి కోల్పోకుండా ఉంటుంది. వయసు మీద పడినట్టుగా కనిపించకుండా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.