ETV Bharat / sukhibhava

మహిళలు, ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా? ముప్పు తప్పదంటున్న నిపుణులు!

Dont Neglect These Gynecological Problems: స్త్రీలు కొన్ని జననేంద్రియ సమస్యలను లైట్​ తీసుకుంటారు. మరి మీరు కూడా అలానే చేస్తున్నారా..? అయితే అలర్ట్​ అవ్వాల్సిందే అంటున్నారు నిపుణులు. కొన్ని సమస్యలను అంత తేలికగా తీసుకోవద్దని.. అవి దీర్ఘకాలంలో దుష్ప్రభావాలను చూపుతాయని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 9:03 AM IST

Dont Neglect These Genital Problems
Dont Neglect These Genital Problems

Dont Neglect These Gynecological Problems: దాదాపు ప్రతి స్త్రీ తన జీవితంలో ఏదో ఒక సమయంలో జననేంద్రియ సమస్యలను ఎదుర్కొంటుంది. కొన్ని సందర్భాల్లో ఇవి ఎలాంటి మందులు ఉపయోగించకుండానే నయమైపోతాయి. కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ సమస్యలను పట్టించుకోకుంటే తీవ్రమైన పరిణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు నిపుణులు. ఇవి సంతానోత్పత్తి, జీవన నాణ్యతను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని సమస్యలు వాటంతటా అవే తగ్గొచ్చు.. కొన్నిసార్లు బాగా ఇబ్బంది పెట్టవచ్చు. అలాంటి వాటికి కచ్చితంగా చికిత్స తీసుకోవాలి. అయితే ఎలాంటి సమస్యలను సీరియస్​గా తీసుకోవాలి..? ఎప్పుడు గైనకాలజిస్ట్​ని సంప్రదించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వైట్ డిశ్చార్జ్: పీరియడ్స్​ టైమ్​లో ప్రతి అమ్మాయికి వైట్ డిశ్చార్జ్ కామన్​. ఇది పెద్ద విషయమే కాదు. పైగా ఇది యోని ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇతర ఇన్​ఫెక్షన్ల బారిన పడకుండా యోనిని రక్షిస్తుంది. అయితే మీకు అసాధారణమైన సమయంలో (అంటే నెలసరి టైమ్​ కాకుండా ఇతర సమయంలో) వైట్ డిశ్చార్జ్ ఉన్నా.. దానిని నుంచి బ్యాడ్​ స్మెల్​ వస్తున్నా అది ఇన్ఫెక్షన్​ను సూచిస్తుంది. అయితే ఈ సమయంలో చాలా మంది సోప్స్​, క్రీములు, లోషన్లు వంటివి ఉపయోగిస్తారు. అయినా కూడా ఎటువంటి మార్పులు ఉండవు. ఏమి చేసినా దీనిలో మార్పు కలగకపోతే.. మీరు గైనికాలజిస్ట్​ను సంప్రదించడం మంచిది. లేకుంటే ఇది గర్భాశయ క్యాన్సర్, క్లామిడియా, గోనేరియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.

రక్తస్రావం: పీరియడ్స్ సమయంలో, గర్భనిరోధక మాత్రలు వేసుకున్నప్పుడు బ్లీడింగ్​ అవుతుంది. అలాకాకుండా ఇతర సమయాల్లో యోని నుంచి రక్తస్రావం వస్తుందంటే మీరు జాగ్రత్త పడాలి. అసాధారణ రక్తస్రావం కొన్నిసార్లు పీరియడ్ సమయంలోని మార్పులతో ముడిపడి ఉంటుంది. లేదంటే.. ఎండోమెట్రియోసిస్, ఫ్రైబాయిడ్స్, అండాశయ తిత్తులు లేదా క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు కూడా దీనికి కారణమవుతాయి. కాబట్టి వెంటనే గైనకాలజిస్ట్​ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

దురద: యోనిలో దురద కామన్​. ఇది కొన్నిసార్లు వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా యోనిలో ఎరుపు, అసౌకర్యం, వాపు లేదా తీవ్రమైన మంటతో కలిగిన దురద వస్తే మాత్రం గైనకాలజిస్ట్​ను సంప్రదించడం మంచిది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా లైంగికంగా పనిచేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య కలుగుతుంది. కాబట్టి సరైన కారణాలు తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..

యూరిన్​: ఇది యోని సమస్యల్లో అత్యంత డేంజర్​గా చెప్పవచ్చు. మూత్ర విసర్జనకు తరచుగా వెళ్లినా.. ఆ సమయంలో తీవ్రమైన నొప్పి వచ్చినా మీరు గైనిక్​ను సంప్రదిస్తే మంచిది. ఇది లైంగికంగా సంక్రమించే అనారోగ్యం. ఫైబ్రాయిడ్ లేదా మూత్రాశయానినికి సంబంధించిన సమస్యకు ఇది సంకేతం కావొచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు మీరు వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

పెల్విక్ పెయిన్: పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో లేదా కటి ప్రాంతంలో నొప్పి రావడం సహజం. కానీ పీరియడ్స్ లేని సమయంలో కూడా మీరు పెల్విక్ ప్రాంతంలో నొప్పిని అనుభవిస్తుంటే మాత్రం అలర్ట్​ అవ్వాల్సిందే. ఇది పునరుత్పత్తి, అండాశయ తిత్తిలో సమస్యలకు గుర్తుగా చెప్పవచ్చు. చూశారుగా.. ఇలాంటి జననేంద్రియ సమస్యలు మీలో కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.