ETV Bharat / sukhibhava

పెరుగు, తేనె కలిపి తీసుకున్నారా? ఇన్ఫెక్షన్లు దూరం.. ఎముకలు దృఢం.. ఇంకెన్ని ప్రయోజనాలో.. - పెరుగు కలిపిన తేనెలో ప్రోబయోటిక్స్

Curd And Honey Mix Benefits in Telugu : పెరుగులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని మనకు తెలుసు. దాంతో పాటు తేనె కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కూడా తెలుసు. మరి ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

honey-mixed-with-curd-benefits-and-yogurt-and-honey-benefits-for-health
తేనె కలిపిన పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు
author img

By

Published : Aug 8, 2023, 6:42 PM IST

Curd And Honey Mix Benefits in Telugu : పెరుగు, తేనె కలిపి తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి మంచి రుచితో పాటు శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. నిత్యం పెరుగు, తేనెను కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుష్కలంగా ప్రోబయోటిక్స్..
Probiotics in Yogurt and Honey Protein : మంచి బాక్టీరియా కారణంగానే పాల నుంచి పెరుగు తయారవుతుంది. దీన్నే మనం ప్రోబయోటిక్స్​గా పిలుస్తాం. ఈ ప్రోబయోటిక్స్ మన శరీరాన్ని ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎప్పుడైతే తేనె, పెరుగు కలిపి తీసుకుంటామో.. ప్రోబయోటిక్స్ మన శరీరానికి ఇంకా ఎక్కువ స్థాయిలో అందుతాయి.

ఎక్కువ ప్రోటీన్లు..
Yogurt and Honey Protein in Telugu : పాల నాణ్యతను బట్టి 100 గ్రాముల పెరుగులో సాధారణంగా 4 నుంచి 14 గ్రాముల వరకు ప్రోటీన్​ ఉంటుంది. అయితే మనం పెరుగులో తేనెను కలిపినప్పుడు.. వాటిలో ఈ ప్రోటీన్​ శాతం మరింత పెరుగుతుంది. దాంతో పాటు పెరుగు నాణ్యంగానూ తయారవుతుంది.

ఎముకల పటుత్వం కోసం..
Curd and Honey Benfits for Bones in Telugu : తేనెలో మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్​ చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేయడంలో సహాయపడతాయి. పెరుగులోనూ ఎక్కువ మోతాదులో కాల్షియం ఉంటుంది. కాబట్టి పెరుగు, తేనె కలిపి తీసుకోవడం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది.

రోగ నిరోధక శక్తి..
Curd and Honey Benfits Immunity : నిత్యం పెరుగు, తేనె కలిపి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో అవి శరీరంలోని ఇన్ఫెక్షన్​ల​పై సమర్థవంతంగా పోరాడతాయి. రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతాయి.

జీర్ణశక్తి మెరుగుపడటం..
Curd and Honey for Digestion Benefits : తేనె, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది. వీటిల్లో ఉండే పోషకాలు, ఇతర సమ్మేళనాలు జీర్ణశక్తిని పెంచడంలో తోడ్పడతాయి. దాంతోపాటు జీర్ణ సంబంధిత ఇతర సమస్యలనూ నివారిస్తాయి. నాడీ వ్యవస్థకూ ఇది మంచి చేకూరుస్తుంది. బరువు తగ్గేందుకు కూడా సహాయ పడుతుంది.

పెసర పప్పుతో అధిక బరువుకు చెక్.. ఈ డిఫరెంట్ వంటకాలు ట్రై చేస్తారా?

Daytime Sleepiness Avoid Tips in Telugu : లంచ్​ తరువాత నిద్రొస్తోందా బుజ్జీ..! ఇలా ట్రై చేయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.