ETV Bharat / sukhibhava

అధిక రక్తపోటును ఆహారంతో నియంత్రించవచ్చా? - blood pressure

గర్భం దాల్చినప్పుడు సాధారణంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో వచ్చే అధిక రక్తపోటు నియంత్రించుకోకపోతే దీర్ఘకాలిక సమస్యగా మారి.. గుండెపోటుకు దారితీస్తుందని పోషకాహార నిపుణులు జానకీ శ్రీనాథ్ చెబుతున్నారు.

blood pressure can be reduced by food habits
అధిక రక్తపోటును ఆహారంతో నియంత్రించవచ్చా?
author img

By

Published : Sep 29, 2020, 6:34 PM IST

రక్తపోటు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. దీన్ని నియంత్రించుకోకపోతే గుండెపోటు... లాంటివి రావొచ్చు. జన్యువులు, అధిక బరువు, మధుమేహం, శారీరక శ్రమ లేకపోవడం... ఇలాంటివన్నీ గుండె జబ్బులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు రక్తపోటును నియంత్రించుకుంటూ ఉండాలి. అందుకోసం ఆహారంలోనూ మార్పులూ చేసుకోవాలి.

ఏం తీసుకోవాలంటే...

మీరు మామూలు బరువుంటే దానికి తగిన కెలొరీలున్న ఆహారం తీసుకోవాలి. అధికంగా ఉంటే కెలొరీలను తగ్గించుకోవాలి. మీరు ప్రెగ్నెన్సీలో బరువు పెరిగినట్లయితే.. దాన్ని అదుపులో ఉంచుకోవాలి. రోజుకు కేవలం 1200 నుంచి 1500 కెలొరీలున్న ఆహారం మాత్రమే ఉండేలా చూసుకోవాలి.పప్పుదినుసులు, సోయానగ్గెట్స్‌, సోయాబీన్స్‌ లాంటి వృక్ష సంబంధ మాంసకృత్తులు తీసుకోవాలి. అలాగే ఆహారంలో రోజుకు 300 నుంచి 400 గ్రా., పండ్లు, కాయగూరలు తినాలి. ఉప్పు రోజులో చెంచా మించొద్దు. వెన్న తీసిన పాలు, పెరుగు లేదా చక్కెర లేని నాన్‌డైరీ మిల్క్‌ తీసుకోవచ్చు. రైస్‌బ్రాన్‌, సోయాబీన్‌, నువ్వుల నూనెలను వంటకు వాడుకోవచ్చు. మళ్లీ మళ్లీ కాచిన నూనెను వాడటం వల్ల ఆహారంలో ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఎక్కువవుతాయి. వీటిద్వారా చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

రోజుకు నాలుగు చెంచాల నూనె వాడాలి. రోజులో యాభైశాతం పొట్టుతో ఉన్న పదార్థాలు తీసుకోవాలి. పొట్టుతో ఉన్న గోధుమ పిండి, బ్రౌన్‌ రైస్‌, మినుములు వాడాలి. వీటిలోని పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌-బి కాంప్లెక్స్‌ రక్తపోటును నియంత్రిస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ. వీటితోపాటు కచ్చితంగా వారానికి రెండున్నర గంటలు వ్యాయామం ఉండాలి. అయితే ఒకేసారి కాకపోయినా అప్పుడప్పుడూ కాసేపు చేసినా ఫలితం ఉంటుంది. కంటినిండా నిద్ర పోవాలి. వీటన్నింటిని కచ్చితంగా పాటిస్తే సమస్య అదుపులో ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.