ETV Bharat / sukhibhava

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలా? పరగడుపున ఈ 'ఐదు' ఆకులు తింటే చాలు! - వేప ఆరోగ్య ప్రయోజనాలు

Best Herbs To Help Lower Cholesterol In Telugu : అధిక కొలెస్ట్రాల్ ఈరోజుల్లో పెద్ద స‌మ‌స్య‌గా మారింది. దీని వ‌ల్ల అనేక జ‌బ్బులు వ‌స్తున్నాయి. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు. అయితే, ఎక్సర్ సైజ్​ చేస్తూనే, ఓ 5 ర‌కాల ఆకులు తిన‌టం వ‌ల్ల వేగంగా కొవ్వు క‌రిగించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Best Leaves To Control Cholesterol
best herbs to help lower cholesterol
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 8:04 AM IST

Best Herbs To Help Lower Cholesterol : ప్రస్తుత కాలంలో అధిక కొలెస్ట్రాల్​తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు, ఇత‌ర అనారోగ్యాలు బారినపడుతున్నారు. కొవ్వు కరిగించుకోవ‌డానికి కొంద‌రు మందులు వాడుతారు. అయితే అధిక‌ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఒక సింపుల్ హోం రెమెడీ ఉందని మీకు తెలుసా? ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని ఆకుల్ని తినడం వల్ల మీ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అవేంటంటే?

1. మున‌గ ఆకులు
మునగ ఆకుల్ని మొరింగ లీవ్స్ అని కూడా అంటారు. వీటిల్లో మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఐరన్, జింక్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడంలో సాయ‌ప‌డ‌తాయి. గుండె జబ్బులు వ‌చ్చే ప్ర‌మాదాన్ని కూడా తగ్గిస్తాయి.

2. కరివేపాకు
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ప‌లు నివేదికల ప్రకారం ఖాళీ కడుపుతో కరివేపాకును తిన‌డం వల్ల అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలున్నాయి. ఇది చర్మంతో పాటు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. మీరు 7 లేదా 9 కరివేపాకులను తీసుకొని వాటిని ఉడకబెట్టి ఆ ద్ర‌వాన్ని ఒక గ్లాసులో పోయండి. త‌ర్వాత అందులో కొంచెం తేనె క‌లుపుకుని తాగండి. ఇలా చేయడం వ‌ల్ల పోష‌కాలు మ‌న శ‌రీరానికి అందుతాయి.

3. తులసి ఆకులు
తుల‌సి చెట్టు వ‌ల్ల ప‌లు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయని మ‌నంద‌రికీ తెలుసు. వాటి ఆకులు కూడా మ‌నకు మేలు చేస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం తులసి ఆకులు రక్తం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు రోజూ ఖాళీ కడుపుతో వీటిని తినాలి. లేదా తులసి ఆకులతో టీ తయారు చేసుకుని కూడా తాగవచ్చు.

4. వేప ఆకులు
వేప చెట్టును ప‌లు ర‌కాల ఔష‌ధాల త‌యారీలోనూ, ఆయుర్వేద వైద్యంలోనూ ఉప‌యోగిస్తార‌ని తెలుసు. వేప ఆకుల వ‌ల్ల మ‌నకు ఆరోగ్య ప‌రంగా మేలు జ‌రుగుతుంది. వీటి ఆకుల్ని రోజూ ఖాళీ కడుపుతో తింటే కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్ ని తగ్గించడమే కాకుండా గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదాన్ని కూడా తగ్గిస్తాయి.

5. బ్లాక్‌బెర్రీ ఆకులు
బ్లాక్‌బెర్రీ ఆకులు కూడా కొలెస్ట్రాల్ మీద ప్ర‌భావం చూపిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక కప్పు నీటిలో 3- 4 బ్లాక్ బెర్రీ ఆకులను మరిగించి, అందులో తేనె వేసి ఖాళీ కడుపుతో తాగవచ్చు.

అధిక కొలెస్ట్రాల్‌ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు ఆరోగ్యంగా ఉండ‌డానికి కేవ‌లం ఆకుల్ని తినడమే కాకుండా జీవనశైలిలో కొన్ని మార్పులు కూడా చేసుకోవాలి. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార ప‌దార్థాలు తినడం, వారంలో క‌నీసం ఐదు రోజులు వ్యాయామం చేయడం, ధూమపానం, మద్య‌పానం లాంటి దుర‌ల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి. రోజూ పోష‌కాహారం తీసుకోవాలి.

తులసి కషాయం తాగితే జలుబు, దగ్గులతోపాటు 'ఒత్తిడి' మటుమాయం!

జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే ఈ లోపాలు మీలో ఉన్నట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.