ETV Bharat / sukhibhava

ఈ ఆహారంతో ఎప్పటికీ యవ్వనమే..

author img

By

Published : Nov 6, 2021, 5:01 PM IST

ఎక్కువ కాలం పాటు నిండు యవ్వనంగా ఉండాలని కోరుకోని వారు ఉండరు. అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో మారుతున్న ఆహారపు అలవాట్లతో పాటు జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. రోజురోజుకు మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేక రకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నిటీ ఒక్కటే పరిష్కారం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Aging
వృద్ధాప్యాన్ని దూరం చేసే ఆహారం

వయసుతో పాటు భౌతికంగా వచ్చే మార్పులను నియంత్రించడం కష్టమేమో కానీ మంచి ఆరోగ్యపు అలవాట్లను అలవరచుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు దరికి రాకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

  • కాంప్లెక్స్​ కార్బోహైడ్రేట్స్​ ఉండే దంపుడు బియ్యం, సజ్జలు, జొన్నలు, బ్రౌన్​ రైస్​ వంటి పదార్థాలను తీసుకోవడం ద్వారా చర్మంపై ముడతలు త్వరగా రాకుండా జాగ్రత్త పడవచ్చు.
  • తృణధాన్యాలు శరీరానికి చక్కని పోషకాలు అందిస్తాయి. రోజు తినే ఆహారంలో ఉండేలా చూసుకోండి. వీటిలో ఫైబర్​, విటమిన్స్​, ప్రోటీన్స్​, మినరల్స్​ సహా వివిధ రకాల ఫైటో మినరల్స్​ ఎక్కువగా ఉంటాయి.
  • బీన్స్​ కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో పిండి పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఫ్యాట్స్​, ప్రోటీన్లు ఉంటాయి. శరీరానికి కావాల్సిన తొమ్మిది అమేనో ఆమ్లాలలో ఎనిమిది వీటిలోనే ఉంటాయి.
  • పొద్దుతిరుగుడు, గుమ్మడి, అవిసె గింజల్లో విటమిన్​-ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
  • డ్రైఫ్రూట్స్​, పల్లీలు, అత్తిపండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
  • శాకాహారులు అయితే పప్పులు, చిక్కుడు, పన్నీర్​, టోఫోలు ఎక్కువగా తినాలి, మాంసాహారులు అయితే గుడ్లు, చేపలు.. ముఖ్యంగా సాల్మన్​ ఫిష్​ను తీసుకోవాలి. సాల్మన్​ ఫిష్​ను వారానికి ఒక్కసారి తినడం వల్ల వయసు పైబడనివ్వకుండా కాపాడుతుంది.
  • యాంటీఆక్సిడెంట్స్​ ఎక్కువగా ఉండే ఆలివ్​ ఆయిల్​ తీసుకోవడం కూడా చర్మానికి మంచిది అంటున్నారు నిపుణులు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : Hair Care Tips: జుట్టు ఒత్తుగా పెరిగి, మెరవాలంటే ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.