ETV Bharat / sukhibhava

పెరుగుతో ఆరోగ్యం పెంచుకోండిలా..!

ఆరోగ్యానికి పెరుగు ఉత్తమమైనది. పేగుల్లో ఉపయోగపడే బ్యాక్టీరియాల వైవిధ్యాన్ని కాపాడే ప్రోబయోటిక్ పెరుగులో ఉంటుంది. పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, అందాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. పెరుగుతో మనకు కలిగే లాభనష్టాల గురించి తెలుసుకుందాం.

Benefits of curd
పెరుగుతో ఆరోగ్యం పెంచుకోండిలా!..
author img

By

Published : Feb 27, 2021, 7:04 PM IST

పెరుగు రుచికే కాదు, అందాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించే వైద్య గుణాలను కలిగి ఉంది. ఇది అద్భుతమైన ప్రోబయోటిక్, జీర్ణక్రియను మెరుగుపరచటంతో పాటు, దంతాలు, ఎముకలకు పుష్టినిస్తుంది. పేగుల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును పూతగానూ కేశాలపై వాడటం ఆనవాయితీ. అయినప్పటికీ, పెరుగు అధిక వినియోగం ఆరోగ్యానికి కొంత హాని కూడా కలిగిస్తుంది. అందువల్ల, పెరుగులోని పోషకాలు వాటి ప్రయోజనాలు, నష్టాలు పరిశీలిద్దాం.

పెరుగులోని పోషకాలు:

పెరుగు తేలికగా జీర్ణమయ్యే ఆహారమేకాకుండా, బరువును కూడా అదుపులో ఉంచుతుంది. కాల్షియం, విటమిన్ బి 2, విటమిన్ బి 12, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్ మొదలైన అన్ని అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి.

100 గ్రాముల పెరుగులో 98 కేలరీలు, 4.3 గ్రాముల కొవ్వు, 17 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్, 364 మిల్లీగ్రాముల సోడియం, 104 మిల్లీగ్రాముల పొటాషియం, 3.4 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2.7 గ్రాముల చక్కెర, 11 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.

పెరుగు వల్ల ఉపయోగాలు:

Advantages of curd
పెరుగు వల్ల ఉపయోగాలు
  • పెరుగు ప్రోబయోటిక్ కావున హానికరం కాని అవసరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం, జీర్ణ కోశ సమస్యలలో ఉపశమనం కలుగుతుంది.
  • పెరుగులో ఉన్న కాల్షియం శరీరానికి అతి ముఖ్యమైనది. యునైటెడ్ స్టేట్స్ వ్యవసాయ శాఖ వారి ప్రకారం 250 గ్రాముల పెరుగులో 275 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అందువల్ల, ప్రతిరోజూ 250 గ్రాముల పెరుగును తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి.
  • పెరుగులో ఉన్న బ్యాక్టీరియా కొన్ని రకాల సూక్ష్మక్రిములతో పోరాడి అంటువ్యాధులు రాకుండా సహాయపడుతుంది.
  • ఆస్ట్రియాలోని వియన్నా విశ్వవిద్యాలయ పరిశోధకుల ప్రకారం రోజుకు 200 గ్రాముల పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది.
  • అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన పరిశోధనలో పెరుగు తీసుకోవడం అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుందని తెలిసింది. పెరుగులో లభ్యమయ్యే ఒక ప్రత్యేక ప్రోటీన్ అధిక రక్తపోటును నియంత్రించి గుండెను బలంగా ఉంచుతుంది.
  • పెరుగు వాడకం వల్ల లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ బ్యాక్టీరియా శరీరంలో హైడ్రోజన్ పెరాక్సైడ్​ను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల స్త్రీలు యోని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
  • పాలను జీర్ణం చేసుకోలేనివారు శరీరానికి అవసరమైన పోషకాలు, ప్రోటీన్​లు పొందడానికి పెరుగు తినవచ్చు.
  • పెరుగు గర్భిణీ స్త్రీలకు కూడా మంచిది. ఇది వారి రక్త కణాలు, హిమోగ్లోబిన్‌ను మంచి స్థాయిలో ఉంచడానికి సహాయపడుతుంది.
  • పెరుగు చర్మంపై జిడ్డును తగ్గించి, పొడి చర్మాన్ని మెరుగుపరచి మొటిమల సమస్యను పరిష్కరిస్తుంది. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉండటం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి నల్ల మచ్చలను తగ్గిస్తుంది.
  • పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం వెంట్రుకలకు అవసరమైన పోషకాలు, ఖనిజాలను అందించడం వల్ల జుట్టు ఒత్తుగా, మెరుపుతో ఉంటుంది. అలాగే, సహజ కండిషనర్‌గా పనిచేయడం వల్ల అనేక హెయిర్ ప్యాక్‌లలో వాడతారు.

పెరుగుతో కొన్ని నష్టాలు కూడా:

Disadvantages of Curd
పెరుగుతో నష్టాలు

కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో పెరుగు తీసుకోవడం మంచిది కాదు. ఆ పరిస్థితులు ఏమిటో తెలుసుకుందాం:

  • బాధ్యతాయుత వైద్యాన్ని సిఫార్స్ చేసే వైద్యుల ప్రకారం లాక్టోస్ నుండి తయారయ్యే గెలాక్టోస్ అనే చక్కెర.. పెరుగులో లభిస్తుంది. దీని ద్వారా అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండవచ్చు.
  • కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌తో బాధపడేవారు పెరుగు తినడం మానేయాలి. అయితే, పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతల వద్ద మితంగా తీసుకోవచ్చు.
  • కొన్నిసార్లు పెరుగు అధికంగా తీసుకోవడం వల్ల ఆహారం నుండి లభించే ఇనుము, జింక్ (యశదం) గ్రహించడాన్ని అడ్డుకుంటుంది. అందువల్ల, పెరుగును మితంగా తీసుకోవాలి.

పెరుగు తినడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మలాముగా వాడినప్పుడు చర్మానికి, జుట్టుకు కూడా పుష్టి కలుగుతుంది. 'అతి సర్వత్ర వర్జయేత్' అన్నట్టు పెరుగైనా అధికంగా సేవిస్తే ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. పెరుగును ప్రతి రోజు మితంగా తీసుకుంటే ఆయుష్షును పెంచుతుంది. మరీ ముఖ్యంగా పెరుగును రాత్రిపూట తినరాదు. మరిన్ని వివరాలకు మీకు తెలిసిన ఆహార నిపుణులను అడిగి తెలుసుకోండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.