ETV Bharat / sukhibhava

వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఈ టిప్స్​ పాటించండి! - చర్మ సంరక్షణ టిప్స్​

Skin Care Tips: ఎండాకాలంలో చర్మంపై మంటలు, బ్లాక్‌హెడ్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, వేడి దద్దుర్లు, శరీర దుర్వాసన వంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటుంటారు. వీటన్నింటి పరిష్కారానికి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఈ టిప్స్​ పాటించండి

author img

By

Published : May 9, 2022, 6:45 AM IST

Skin Care Tips: ఎండలు మండిపోతున్నాయి. మిగతా సీజన్లలతో పోలిస్తే ఎండాకాలంలో చర్మ సంరక్షణ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా చర్మం పెళుసు బారిపోతుంది. నల్లగా మారి కాంతివిహీనంగా తయారవుతుంది. అందువల్ల ఎండాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు సన్​స్క్రీన్​ లోషన్​ తప్పక పూసుకోవాలి. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీల లోహిత (యూవీ) కిరణాలు మన చర్మంపై పడ్డప్పటికీ, సన్​స్క్రీన్​ లోషన్​ మీ చర్మానికి రక్షణగా నిలుస్తుంది.

వేసవి కాలం వచ్చిందంటే చాలు, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తేమ స్థాయి అధికమవ్వడం వల్ల చర్మంపై చెమట చేరి, జిడ్డుగా మారుతుంది. దీనివల్ల చర్మంపై మంటలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, వేడి దద్దుర్లు, శరీర దుర్వాసన వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చాలా మందికి ఎండాకాలంలో విపరీతంగా దురదలు వస్తాయి. వాటి నుంచి బయటపడేందుకు నిపుణులు చెప్పిన సలహాలను తెలుసుకుందాం.

"ముఖ్యంగా ఎండాకాలానికి అనుగుణంగా మన అలవాట్లు మార్చుకోవాలి. అలా చేస్తే ఎటువంటి ఇబ్బందులు రావు. ఎండలు పెరిగినప్పుడు పిత్త ప్రకృతి ఉన్న మనుషులకు చెమట ఎక్కువగా పడుతోంది. వారందరికీ చర్మ సమస్యలు వస్తాయి. వాత ప్రకృతి ఉన్న వారికి చెమట తక్కువ పట్టి చర్మం పొడిబారుతుంది. వారికి ముఖ్యంగా దురద సమస్య వస్తుంది" అని నిపుణులు చెబుతున్నారు.

చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • ఆహారం విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి
  • నూనెలో వేయించే పదార్థాలకు దూరంగా ఉండాలి
  • గరంమసాలా వేసే పదార్థాలను దూరం పెట్టాలి
  • రోజూ నీరు ఎక్కువగా తాగాలి
  • ద్రవ పదార్థాలు ఎక్కువగా స్వీకరించాలి
  • కూల్​ డ్రింక్స్​, చల్లటి నీరు​ తీసుకోకూడదు
  • కుండలో ఉన్న చల్లని మంచి నీరు మాత్రమే తాగాలి
  • గంటకోసారి గ్లాసు మంచి నీరు తీసుకోవాలి
  • మజ్జిగ, కొబ్బరి నీరు తరచూ తాగాలి
  • సున్నిపిండిలో ఆయుర్వేద మూలికల చూర్ణాన్ని కలిపి స్నానం చేసే సమయంలో శరీరమంతా రుద్దుకోవాలి

ఇదీ చదవండి: మామిడి పండ్లు బాగా తింటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.