ayurveda for brain health: మనిషి ఏ పని చేయాలన్నా అందులో మెదడు ముఖ్యభూమిక పోషిస్తుంది. అలాంటి మెదడు చురుకుగా పనిచేయక చాలా మంది మతిమరుపుతో బాధ పడుతుంటారు. అలాంటి వారికోసం మన ఆయుర్వేదం చెబుతున్న కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు
- పాలు ,మజ్జిగ, గోరు వెచ్చటి నీళ్లు
- కూరగాయల రసం, పళ్ల రసం, చేపలు, జీడిపప్పు
- ఆలివ్ నూనె, బెర్రీలు ,బీట్రూట్
- తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకుంటే మెదడు బాగా పనిచేస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- మద్యపానం, ధూమపానం తగ్గించుకోవాలి.
- చిప్స్, జంక్‌ఫుడ్, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు.
- పజిల్స్, చదరంగం లాంటి ఆటలు ఆడాలి.
ఆయుర్వేద చిట్కాలు
- చిన్న కప్పులో కొంత నీరు, కొన్ని తులసి ఆకులు, యాలకులు వేసి మరిగించుకొవాలి. ఆ వేడి పానియాన్ని ఉదయం, సాయంత్రం రెండు పూటలు తాగాలి.
- వేడి పాలలో బాదం పొడి, యాలకుల పొడి, పటిక బెల్లం కలుపుకొని తాగాలి.
- రెండు గ్రాముల బ్రాహ్మిచూర్ణం, యష్టిమధు చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని కొంచెం తేనె, నెయ్యి కలుపుకొని ముద్దలాగా చేసి తీసుకోవాలి.
- రెండు గ్రాముల వసకొమ్ము చూర్ణంలో కొద్దిగా తేనె, నెయ్యి కలిపి తీసుకోవాలి.
- బ్రాహ్మిబట్టి, సరస్వతి లేహం, సారస్వతారిష్టం, శంకపుష్టి రసాయనం లాంటివి ఉంటాయి. వీటిని వైద్యుల సలహా మేరకు ఆయుర్వేద దుకాణాల్లో తీసుకోవాలి.
- తగినంత నిద్ర- కనీసం 8 గంటలు పడుకోవాలి.
- తలకు కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటే మెదుడు చురుకుగా పనిచేస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:ఈ ఆయుర్వేద చిట్కాలతో నడుం నొప్పి మాయం!