Hair care mistakes: మీ జుట్టు ఒత్తుగా, పట్టులా, మృదువుగా మారాలంటే, మెరుపులీనాలంటే... కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలి. అవేంటంటే..
Applying oil before head bath: నూనె లేకుండా...షాంపు వద్దు! చాలామంది సమయం లేదనో, కాలేజీ, ఆఫీసులకు ఆలస్యమవుతుందనే తొందరలో నేరుగా తలస్నానం చేసేస్తారు. స్నానానికి ముందు జుట్టుకు నూనె పెట్టుకోవడం, తలకు మర్దనా లాంటివి చేయరు. దీన్నిలా కొనసాగించడం వల్ల కొన్నాళ్లకు జుట్టు పొడిబారుతుంది. అలాగే తలలో సహజసిద్ధంగా ఉండే నూనెగ్రంథులు కూడా ఎండిపోతాయి. ఫలితంగా కొన్నాళ్లకు జుట్టు బలహీనపడిపోయి రాలిపోతుంది.
ఎక్కువ టైమ్‌తో నష్టమే!
dos and donts for hair loss: జుట్టు పెరగడానికి రకరకాల పూతలు వేసుకుంటుంటాం. అయితే వాటిని ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల లాభం కంటే నష్టమే అధికం. కాబట్టి నిర్ణీత సమయం తర్వాత వాటిని తీసేయాలి. అలాగే పూతను తొలగించడానికి జుట్టును ముందు పూర్తిగా తడిపి ఆ తర్వాత మెల్లిగా తీసేయాలి.
తువ్వాలు ఎక్కువసేపొద్దు...
Hair care tips: తలంటు పోసుకున్న తర్వాత తలకు టవల్ చుట్టుకుంటాం. అయితే దీన్ని ఎక్కువసేపు అలానే పెట్టుకోవడం మంచిది కాదు. అలాగే దీన్ని గట్టిగా లాగి తీసేయడం, జుట్టును దులపడం వల్ల వెంట్రుకలు చిట్లుతాయి.
కండిషనర్ కూడా కారణమే!
చాలామంది ఎక్కువ కండిషనర్ పెడితే జుట్టు మరింత మృదువుగా మారుతుందనుకుంటారు. ఇది సరికాదు. కావాల్సినంత వాడుకుంటే సరిపోతుంది. అలాగే ఎక్కువసేపు పెట్టకూడదు. మొత్తం తలను శుభ్రంగా కడిగేయాలి. కండిషనర్‌ను కుదుళ్లకు కాకుండా, జుట్టు చివర్లకు పట్టిస్తే చాలు.
ఇదీ చూడండి: Hair Care Tips: జుట్టు ఒత్తుగా పెరిగి, మెరవాలంటే ఇలా చేయండి!