ETV Bharat / sukhibhava

​తిన్న తర్వాత వాకింగ్​ చేయొచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా? - వాకింగ్​ వార్త

సాధారణంగా చాలా మందికి వాకింగ్​ విషయంలో అనేక సందేహలు ఉంటాయి. పరగడుపున నడవాలా? ఏదైనా తిన్న తర్వాతైనా నడవొచ్చా? రోజులో ఏ సమయంలోనైనా నడవొచ్చా? ఇంట్లో కూడా వాకింగ్​ చేయొచ్చా? వీటిన్నంటిపైన నిపుణులు ఏమంటున్నారంటే..

at which time we have to walk every day
at which time we have to walk every day
author img

By

Published : Jul 29, 2022, 12:52 PM IST

Walking Doubts: నడక అనగానే చాలామందికి ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. సాధారణంగా ఉదయం పూట నడవటం మంచిదని, ఎందుకంటే ఉదయం వేళ కాలుష్యం తక్కువగా ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. చల్లటి, తాజా గాలి మనసుకు ఉత్తేజం కలిగిస్తుందని కూడా అంటారు. అయితే పరగడుపున నడవాలా? లేక ఏదైనా తిన్నాక వాకింగ్​ చేయాలా? వంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి. వీటిపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

"పరగడుపున నడవాలా అంటే అవసరం లేదు. చిన్న బ్రెడ్డు ముక్కలాంటిది తిని నడవొచ్చు. మధుమేహంతో బాధపడేవారికిది మరీ ముఖ్యం. ఇలా చేయటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు బాగా పడిపోతాయనే భయం ఉండదు. అలాగని ఎవరైనా సరే కడుపు నిండా తిని నడవటం మంచిది కాదు. భోజనం చేసినప్పుడు జీర్ణకోశ వ్యవస్థకు రక్త ప్రసరణ బాగా జరగాలి. కడుపు నిండా తిని వడివడిగా నడిస్తే గుండె మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది మంచిది కాదు. సాయంత్రం పూట నడవకూడదనేమీ లేదు. ఇదేమీ నిషిద్ధం కాదు. కాకపోతే పొద్దుట్నుంచీ పనిచేసి ఉండటం వల్ల శరీరం అలసిపోయి ఉంటుంది. దీంతో నడక అంత ఉత్సాహంగా సాగదు."

-- డా. ఎ.అశ్వినీ కుమార్​, ప్రొఫెసర్​ ఆఫ్​ మెడిసిన్​

"రాత్రిపూట నడవాలంటే చీకటి మూలంగా సరిగా కనిపించక ఇబ్బందులు తలెత్తొచ్చు. కాలికి ఏదైనా తగిలి కింద పడిపోవచ్చు. ఎముకలు పెళుసుగా ఉండే వృద్ధులకు ఇది ప్రమాదకరం. ఆరుబయటే నడవాలని లేదు. ఇంట్లోనూ నడవొచ్చు. గదులలో కాకుండా పొడవాటి వరండాలో, పెరటిదొడ్డిలో లేదూ డాబా మీద నడవొచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది రోజుకు 10వేల అడుగులు నడవటం. ఎప్పుడు నడిచినా, ఎక్కడ నడిచినా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి" అని నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి: ఎయిడ్స్ కన్నా ఈ వ్యాధి మరణాలే ఎక్కువ.. టీకా తీసుకున్నారా?

ఊడిన జుట్టు తిరిగొస్తుందా?.. వర్షకాలంలో జుట్టు సంరక్షణ ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.