ETV Bharat / sukhibhava

బ్లాక్, వైట్, ఎల్లో.. ఈ ఫంగస్​లేంటి? ఎవరికి ముప్పు? - white fungus precautions

దేశంలో రోజుకో 'రంగు'తో ఫంగస్ విజృంభిస్తోంది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్.. ఇప్పుడు కొత్తగా ఎల్లో ఫంగస్. అసలు ఈ రంగులేంటి? ఈ ఫంగస్​ల లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో మీకు తెలుసా?

black, yellow, white fungus
బ్లాక్ ఎల్లో వైట్ ఫంగస్
author img

By

Published : May 24, 2021, 6:46 PM IST

కరోనాతో అల్లాడుతున్న దేశ ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేసేలా వరుసగా వ్యాధులు విరుచుకుపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం బ్లాక్ ఫంగస్ వెలుగులోకి రాగా.. ఇటీవలే వైట్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు కొత్తగా ఎల్లో ఫంగస్ ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది. అసలు ఈ ఫంగస్​లు ఏంటి? ఎందుకు ఇలా విజృంభిస్తున్నాయి?

ఏంటీ ఎల్లో ఫంగస్?

ఎల్లో ఫంగస్​ను మ్యుకోర్​సెప్టికస్ అని కూడా అంటారు. ఎల్లో ఫంగస్‌ సమస్య శరీరం లోపల ప్రారంభం అవుతుంది. ఈ ఫంగస్​ ప్రమాదకరమైనదని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్​ను గుర్తించకపోతే శరీరంలో మరింతగా వ్యాపిస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి- అధిక యాంటీబయాటిక్సే బ్లాక్​ ఫంగస్​కు కారణం!

ఎల్లో ఫంగస్​ లక్షణాలు

  • విపరీతమైన నీరసం
  • ఆకలి బాగా తగ్గిపోవడం లేదా అసలు ఆకలి లేకపోవడం
  • క్రమంగా బరువు తగ్గిపోవడం
  • తీవ్రత ఎక్కువగా ఉంటే లక్షణాలు
  • గాయాలు త్వరగా తగ్గకపోవడం
  • గాయాల నుంచి చీము కారడం
  • శరీరంలోని కీలక అవయవాలు విఫలం కావడం
  • కళ్లు పీక్కుపోవడం

నివారణ ఎలా?

ఎల్లో ఫంగస్‌ ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల వస్తుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఫంగస్‌ చేరే అవకాశం ఉన్న, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు పడేయడం ఉత్తమం. ఎల్లో ఫంగస్‌ చికిత్సకు ప్రస్తుతం ఆంఫోటెరిసిన్‌-బీ ఇంజక్షన్‌ అందుబాటులో ఉంది.

బ్లాక్ ఫంగస్

బ్లాక్​ ఫంగస్​ను మ్యూకోర్​మైకోసిస్ అని అంటారు. మధుమేహం ఉన్న వారు కొవిడ్ చికిత్సలో స్టెరాయిడ్స్ వాడితే బ్లాక్ ఫంగస్ సులభంగా సోకుతుంది. చక్కెర నిల్వలు అధికంగా ఉన్న, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న కరోనా రోగుల్లో దీని ముప్పు ఎక్కువ. కేన్సర్, అవయువ మార్పిడి ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారు, ఒరికొనజోల్ చికిత్స తీసుకున్న వారికీ ముప్పు ఎక్కువే.

ఇదీ చదవండి- 'బ్లాక్​ ఫంగస్​ అంటే భయం వద్దు కానీ..'

బ్లాక్ ఫంగస్ లక్షణాలు

  • సైనసైటిస్-ముక్కుదిబ్బడ, నలుపు రంగులో ముక్కుకారటం, దవడ, చక్కిళ్లు నొప్పి
  • మొహంపై ఒక వైపు నొప్పి, తిమ్మిరి, వాపు
  • ముక్కుదూలంపై, అంగళిపై నలుపు రంగు
  • పంటి నొప్పి, వదులు పళ్లు, దవడ నొప్పి
  • అస్పష్ట కంటి చూపు, నొప్పి, జ్వరం, చర్మంపై పుండ్లు
  • ఛాతీలో నొప్పి, దగ్గితే రక్తం, ఆయాసం

ఇదీ చదవండి- గాలి ద్వారా బ్లాక్​ ఫంగస్ వ్యాప్తి- వాటిపైనా ప్రభావం!

జాగ్రత్తలు

  • రక్తంలో చక్కెర అదుపులో ఉంచుకోవాలి.
  • స్టెరాయిడ్స్ వైద్యుని పర్యవేక్షణలోనే వాడాలి.
  • గదిలో పరిశుభ్రత పాటించాలి.
  • ఎయిర్​ కూలర్లు, ఏసీలలో స్వచ్ఛమైన నీటినే వాడాలి.
  • యాంటీ బయాటిక్స్/యాంటీ ఫంగల్స్ వాడకంలో నియంత్రణ పాటించాలి.

వైట్ ఫంగస్

వైట్​ ఫంగస్​ను ట్రెమెలా ఫుకిఫోర్మిస్ అని అంటారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి వైట్​ ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

లక్షణాలు

  • కరోనా రోగుల్లో కనిపించే లక్షణాలు
  • శరీరంలోని అనేక అవయవాల ఫంగస్​ ప్రభావం
  • చర్మం, గోళ్లు, నోటి లోపలి భాగం, కిడ్నీలు, మెదడుపై వ్యాధి ప్రభావం

జాగ్రత్తలు

  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
  • రోగనిరోధక శక్తిని పెంచుకోవడం
  • పరిశుభ్రతను పాటించడం

ఈ రంగుల గోలేంటి?

ఏ ప్రాంతాల్లో ఫంగస్ అభివృద్ధి చెందిందనే విషయంపై దాని రంగు ఆధారపడి ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చెందితే ఫంగస్​ల రంగు భిన్నంగా కనిపిస్తుందని దిల్లీ ఎయిమ్స్ పేర్కొంది.

ఈ ఫంగస్​లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయా?

ఫంగస్ వ్యాధి సాంక్రమిక వ్యాధి కాదు. ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవు.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మ్యుకోర్​మైకోసిస్, క్యాండిడా, ఆస్పోరోజెనస్ ఇన్ఫెన్షన్​లకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఇదీ చదవండి- ఈ లక్షణాలు ఉన్నాయా? బ్లాక్​ ఫంగస్​ కావచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.