ETV Bharat / sukhibhava

smoking stop tips: పొగ మానటానికి సంయుక్త చికిత్స మేలు - పొగమాన్పించడానికి విధానాలు

పొగతాగేవారి అలవాటు మాన్పించడాని (smoking stop tips) కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏదో ఒకటి పాటిస్తే సమస్యను గట్టెక్కేయెచ్చనుకుంటారు. కానీ పొగతాగే అలవాటు మాన్పించటానికి ఒకట్రెండు చికిత్సలు కలిపి ఇవ్వటం మేలని (smoking stop treatment) యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ అధ్యయనం సూచిస్తోంది.

smoking stop tips
పొగమానే పద్దతులు
author img

By

Published : Nov 3, 2021, 11:21 AM IST

పొగతాగే అలవాటు మాన్పించటానికి (smoking stop tips) ఒకట్రెండు చికిత్సలు కలిపి ఇవ్వటం మేలని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా వారెనెక్లైన్‌, నికొటిన్‌ రిప్లేస్‌మెంట్‌ థెరపీ (ఎన్‌ఆర్‌టీ) కలిపి ఇస్తే మంచి ఫలితం కనిపిస్తున్నట్టు తేలింది. పొగ అలవాటు మాన్పించే చికిత్సలో వారెనెక్లైన్‌, బుప్రొపియాన్‌, ఎన్‌ఆర్‌టీని ప్రధానంగా వాడుతుంటారు. ఇ-సిగరెట్లు కూడా కొంతవరకు తోడ్పడతాయి. కానీ ప్రస్తుతం వైద్యపరంగా వాడుకోవటానికి వీటికి అనుమతి లేదు. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు, జబ్బులకు పొగ అలవాటు (smoking stop treatment) పెద్ద కారణంగా నిలుస్తున్న నేపథ్యంలో తాజా అధ్యయనం నిర్వహించారు.

వారెనెక్లైన్‌, బుప్రొపియాన్‌, ఎన్‌ఆర్‌టీ, ఇ-సిగరెట్ల (smoking stop medicine) లాభనష్టాలను బేరీజు వేశారు. వారెనెక్లైన్‌, ఎన్‌ఆర్‌టీతో కూడిన సంయుక్త చికిత్స బాగా సమర్థంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. బుప్రొపియాన్‌ కూడా సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలినప్పటికీ కొన్ని తీవ్ర దుష్ప్రభావాలు పొడసూపుతున్నాయి. ఇ-సిగరెట్లు కొంతవరకు మేలు చేస్తున్నా ఇవి ఎంతవరకు సురక్షితమనే దాని మీద ఇంకొంత పరిశోధన చేయాల్సి ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:అతి వ్యాయామం వద్దు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.