ETV Bharat / sukhibhava

తమలపాకులో దాగి ఉన్న 10 ఆరోగ్య రహస్యాలివే.. - odour

మంచి భోజనం తరువాత తమలపాకు వేసుకోవటం చాలా మంది భారతీయులకు ఇష్టమైన అలవాటు. అది మామూలు వక్కాకు కావచ్చు, జరదా, బెనారస్, తియ్యటి పాన్ కావచ్చు. ఇది నోటిని సుగంధ భరితం చేయటమే కాకుండా మధుమేహ నివారిణిగా కూడా పని చేస్తుంది. తమలపాకు వైద్య గుణాల గురించి తెలుసుకుందాం.

Betel leaf health benefits
తమలపాకులో దాగి ఉన్న 10 ఆరోగ్య రహస్యాలివే..!
author img

By

Published : Jun 7, 2021, 3:58 PM IST

తమలపాకు, వక్క, సున్నంతో భోజనాన్ని ముగించటం భారతీయుల సంప్రదాయం. పెళ్లి భోజనాల తరువాత పాన్ వేసుకోవటం మన అలవాటు. తాంబూలం జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది రుచిగా ఉండటమే కాక ఎన్నో ఆరోగ్య సమస్యలను సులభంగా పరిష్కరించగలదు.

తమలపాకు పైపరేసి కుటుంబానికి చెందిన తీగ. నేషనల్ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం తమలపాకులోని ఔషధ రసాయనాలు శరీరంలోని విష పదార్ధాలను తీసివేయగలవు. రోగ నిరోధక శక్తిని పెంచటమే కాక మధుమేహాన్ని కూడా నివారించగలవు.

తమలపాకు కడుపులో పుండ్లను, క్యాన్సర్​ను, పిల్లల్లో జలుబును, చెవిపోటును, తలనొప్పిని నివారించి శరీరంలో శోథను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యానికి, శ్వాసకోశాలకు మేలు చేస్తుందని నిరూపితమైనది. తమలపాకులో నీటితో పాటు మాంసకృత్తులు, నూనెలు, కొన్ని లోహాలు, పీచు, పిండి పదార్థాలు, నికోటిన్ ఆమ్లం, విటమిన్ సి, ఎ, రిబోఫ్లేవిన్, భాస్వరం, పొటాషియం, క్యాల్షియం, ఇనుము, అయోడిన్ మొదలైన ఘటకాలున్నాయి. తరచూ తాంబూల సేవన చేస్తే ఎన్ని లాభాలుంటాయో చూద్దాం.

  1. జీర్ణశక్తి మెరుగుపడుతుంది: తాంబూల సేవన వల్ల నోటిలో లాలాజలం బాగా స్రవించి జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. తమలపాకు జీర్ణాశయంలో ఆమ్లతను తగ్గించి కడుపుబ్బరం లేకుండా చేస్తుంది. ఆకలిని పెంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది.
  2. పంటి ఆరోగ్యానికి: నోటి దుర్వాసనను నివారించే ఉత్తమద్రవ్యం తమలపాకు. తమలపాకులో ఉన్న వైద్య గుణాల వల్ల నోటిలో జబ్బులకు కారణమైన బ్యాక్టీరియాను సంహరించగలదు. దీని వల్ల దంతక్షయం తగ్గి చిగుళ్లు బలపడతాయి. నోటిలో రక్త స్రావాన్ని కూడా నివారించగలదు.
  3. జలుబు, దగ్గు నివారణ: కొన్ని రకాల శ్వాసకోశ సమస్యలను, దగ్గు, శోథ, ఆస్తమాలను తగ్గించగలదు. తమలపాకును వెచ్చగా చేసి ఛాతీపై ఉంచితే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఇది గొంతులో కఫాన్ని తగ్గించగలదు. అనేక గొంతు, నోరు సమస్యలకు తమలపాకును వేడి చేసిన నీళ్లతో పుక్కిలించడం చక్కటి పరిష్కారం అవుతుంది.
  4. మూత్రప్రసారణి: తమలపాకు మూత్రాన్ని సులభంగా జారీ చేసి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడగలదు.
  5. ఊబకాయంలో: ఇందులో ఉన్న పీచు వల్ల శరీర బరువును నియంత్రించగలదు.
  6. క్యాన్సర్ నివారిణి: తమలపాకులో ఉండే ఔషధ దినుసులు శరీరంలో క్యాన్సర్ గడ్డలు పుట్టకుండా, పెరగకుండా నివారించగలవు.
  7. సుగంధిని: నోటికి సుగంధాన్ని ఇవ్వటమే కాక మొత్తం శరీరానికి మంచి వాసననివ్వగలదు. తమలపాకును నీటిలో వేడిచేసి ఆ నీటితో స్నానం చేస్తే చర్మానికి మంచి వాసన చేకూరుతుంది.
  8. నోటిలో పుండ్లు: నోటిలో అప్పుడప్పుడు కలిగే పుండ్లను తమలపాకు తగ్గించగలదని పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకోసం కచ్చు కలిపిన తాంబూలాన్ని సేవించాలి.
  9. వాపు నివారిణిగా: తమలపాకులో ఉన్న ఫెనాల్ అనే రసాయనిక పదార్థం కీళ్ల నొప్పులు, వాపుకు, శోథను నివారించగలదు.
  10. మధుమేహంలో: ఇది రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించి మధుమేహ రోగులకు మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.