ETV Bharat / state

యాదాద్రి ఆలయం గొప్పతనం ఇదే..!

ఒకనాటి పాతగుట్ట నరసింహస్వామి పాత ఆలయం, యాదగిరిగుట్ట నవ నారసింహ క్షేత్రమై ఎందరో భక్తజనుల తీర్థయాత్రాస్థలిగా విరాజిల్లింది. నేడు ప్రపంచ ప్రఖ్యాతి చెందేలా, సుందరమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంలా రెండువేల కోట్ల రూపాయల వ్యయంతో హృదయంగమమైన దేవస్థానంగా తీర్చిదిద్దుతున్నారు. ఓ మహర్షి తపస్సుతో లక్ష్మీ నరసింహస్వామి వెలిశారంటారు.

Yadadri
author img

By

Published : Jun 17, 2019, 6:07 AM IST

Updated : Jun 17, 2019, 10:21 AM IST

యాదాద్రి ఆలయంపై ప్రత్యేక కథనం...

తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి... యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయం. రుష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి... ఆంజనేయస్వామి సలహా మీద ఈ కొండపై చాలా కాలం తపస్సు చేశారు. ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి తపస్సులో ఉన్న ఈ రుషిని తినబోయాడు. ఆ విషయం ఎవరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆ విష్ణువు చేతిలోని సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. ఆ సుదర్శనమే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసిందిట. యాద మహర్షి తపస్సుకి మెచ్చి, లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడని స్థలపురాణం. ఆ కొండే రుషి పేరుమీద యాదగిరిగా ప్రసిద్ధికెక్కిందని ఇక్కడివారు చెబుతారు.

యాదా రుషి తపస్సు చేసింది ఇక్కడే...

యాదా రుషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు సమీప్యుడు ఈ దేవుడంటారు. పెద్దపెద్ద కానుకలు, ముడుపులు, భూరివిరాళాలు ఇచ్చిన వారినే కాపాడతాడనేమీ లేదు. భక్తితో చిల్లర నాణేలు వేసినా కరుణిస్తాడని, చిల్లర్ల దేవుడని ఆప్యాయంగా పిలుచుకుంటారు. చాలా సాధారణమైన కోరికలు కూడా నెరవేరక వ్యధ చెందుతున్న సామాన్య భక్త జనం ఎంతో విశ్వాసంతో ఈ క్షేత్రానికి వస్తారు.

కోనేరు ప్రత్యేకతలు...

ఆలయ కోనేరులో స్నానం చేస్తే చాలు భయపీడలు పోతాయని, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ కోనేరుని విష్ణుకుండం అని అంటారని ఆలయ ప్రధానార్చకులు చెబుతున్నారు. రాక్షస సంహారంచేసి లోక కల్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్లని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరిందని అందుకే ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం ఉందంటారు. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయట.

పితృకార్యాలకు అనువైన చోటు...

ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారట. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్లపాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తుంటారు. ప్రదక్షిణలకు కూడా పుష్కరిణి స్నానమంతటి విశేషం ఉంది. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి 16 సార్లు, గర్భాలయం చుట్టూ 16 ప్రదక్షిణలు మొత్తం 32 సార్లు ప్రదక్షిణలు చేస్తే ఎన్నో మానసిక, శారీరక బాధలు తొలగుతాయని, వైద్యనారసింహుడని భక్తులు నమ్ముతారు.

ఇదీ చూడండి: యాదాద్రి పేరు విశిష్టత ఇదే..!

స్వయంభుగా వెలసిన శివుడు..

మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడట. ఇంకో విశేషం... ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ల నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. మరో ముఖ్య విశేష చర్య ... గర్భాలయ నారసింహస్వామి వారిని దర్శించుకుని, స్వామి వారి మంత్రదండంతో కుడిభుజంపై తాటింపజేయటం... నేనున్నాను మీకేం పరవాలేదు అని స్వామివారే భుజం తట్టినంత సంతృప్తహృదయులవుతారట. ఆ మానసిక ఉత్తేజంతో వెళ్లినవారు తమ పనులను ఎంతో విశ్వాసంతో చేసి, అన్నింటా కృతకృత్యులవుతారట.

ఇదీ చూడండి: యాదాద్రి వైభవం... త్వరలో ఆవిష్కృతం

మరికొద్దిరోజుల్లో భవ్యమైన దేవస్థానంగా కనువిందు...

పాతగుట్ట ఆలయం పంచనారసింహ క్షేత్రంగా అభివృద్ధిచెందిన తరువాత ఇటీవల వరకూ ఎంతో ప్రాశస్త్యాన్ని పొందింది. ప్రతీ ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు వేలాదిగా, లక్షలాదిగా తరలివస్తారు. అదే లక్ష్మీనారసింహాలయం మరి కొద్దిరోజుల్లో ఓ భవ్యమైన దేవస్థానంగా అవతరించబోతోంది. అలా నూతన నిర్మాణమవుతున్న ఆలయం అంతకు ముందున్న ఆలయ వాస్తు ఆగమ శాస్త్రాలకు ఇసుమంత కూడా భంగం వాటిల్లకుండా పాటిస్తున్నారు. గత ఆలయం పశ్చిమాభిముఖంగా ఉన్న మూలవిరాట్టుని అదే విధంగా పశ్చిమాభిముఖంగానే గర్భాలయ దేవుణ్ని ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. అందుకే పశ్చిమ మహారాజగోపురం ఏడు అంతస్తులతో 77 అడుగుల్లో రూపొందుతోంది. దీన్ని సప్తతల అంటారు.

48 అడుగుల దివ్య విమాన గోపురం...

దక్షిణం, ఉత్తరం, తూర్పు రాజగోపురాలు... 55 అడుగుల్లో నిర్మిస్తున్నారు. వీటిని పంచతల అంటే అయిదు అంతస్తుల రాజగోపురాలుగా పిలుస్తారు. ఈ నాలుగుకాకుండా మరో రెండు మూడంతస్తుల రాజగోపురాలు సిద్ధమవుతున్నాయి. ఇక ఏడోదైన దివ్య విమాన గోపురం 48 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకుంటోంది. ఇది ప్రధాన గుడి గర్భాలయం పైన నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఇవన్నీ తుదిదశలో ఉన్నాయి. ఇక ఆలయంలో 12 మంది ఆళ్వార్ల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి ప్రవేశిస్తుండగా క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక.. ఆళ్వారుల ముందు నుంచి గర్భాలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. రామానుజాచార్యులు, నమ్మాళ్వార్, పెరుమాండ్లాచార్యుల వంటి పన్నెండు మంది వైష్ణవాచార్యుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇలా యాదాద్రి పుణ్యక్షేత్రం... అచ్చెరువొందేలా తయారవుతోంది.

ఇదీ చూడండి: 2000 కోట్లు.... ఏడు గోపురాలు... 55 అడుగులు

Intro:Body:Conclusion:
Last Updated : Jun 17, 2019, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.