యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి దర్శనానికి వెళ్లే ముందు కొండ కింద ఉన్న లక్ష్మీపుష్కరిణిలో... పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కల్యాణకట్ట సముదాయంలో స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా... ఉచిత దర్శనం టోకెన్లను అందిస్తున్నారు. ఇందుకోసం ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారు. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ తీసుకుని సర్వ దర్శనం టోకెన్ అందిస్తున్నారు.
అప్పటిలాగా దర్శనం వెళ్లడానికి లేదు. ఆన్లైన్ ద్వారా టికెట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా... దర్శనం జరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం.. ఉన్న యాదాద్రి ఇప్పుడున్న యాదాద్రి మారిపోయింది. ఒక అద్బుత యాదాద్రిగా కేసీఆర్ తీర్చిదిద్దారు. ఏవిధంగా భక్త రామదాసు భద్రాద్రిని నిర్మించారో... అలాగే యాదాద్రిని కేసీఆర్ అంత గొప్పగా తీర్చిదిద్దారు. కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు.
- భక్తులు
శ్రీలక్ష్మి నారసింహుడిని దర్శించుకుని భక్తులు పులకించిపోతున్నారు. మహా సంప్రోక్షణ తర్వాత స్వామివారి దర్శనభాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి క్షేత్రాన్ని కళ్లారా చూడడమే తప్ప... వర్ణించలేమని చెబుతున్నారు. శిల్ప కళ వైభవాన్ని చూసి తన్మయత్వం పొందుతున్నారు. దీక్షా పరుల మండపంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతున్నారు.
ఇవీచూడండి: