యాదాద్రి పుణ్యక్షేత్రంలో సుదర్శన మహాయాగం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు క్షేత్ర విశిష్టత నలుదిశలా వ్యాపించేలా ఆధ్యాత్మిక సభను భారీగా నిర్వహించాలనుకున్నట్లు సమాచారం. మహాయాగ నిర్వహణకు అనువుగా యాడా యాంత్రాంగం కొండ కింద ఉత్తర దిశలో 90 ఎకరాల ప్రాంగణంలో చదును చేసే పనుల్లో జోరు పెంచింది.

యాగ నిర్వహణ స్థలాన్ని మంగళవారం ఈఎన్సీ రవీందర్ రావు పరిశీలించారు. మే నెలలో ఆలయాన్ని పునఃప్రారంభం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: రోజువారీ కరోనా పరీక్షలు రెట్టింపు చేయాలి: సీఎస్