యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ మోత్కూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలోని అంగడి బజార్లోని పశువుల సంత ఆవరణలో మార్కెట్ ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉందని కలెక్టర్ తెలిపారు.
భూసర్వే చేసి హద్దులు సూచించి నివేదికను అందించాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ , మున్సిపల్ కమిషనర్ మహ్మద్ , తహసీల్దార్ అహ్మద్, మున్సిపాలిటీ మేనేజర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వారి ఆలోచన.. ఎందరికో ఆదాయమార్గం..!