రాష్ట్ర ప్రభుత్వం నూతన పీఆర్సీ అమలు కోసం తీసుకొచ్చిన జీవో నంబర్ 60ని తక్షణమే సవరించాలని యాదాద్రి జిల్లా ఎఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆసుపత్రిలో పని చేస్తోన్న పారిశుద్ధ్య, ఇతర కార్మిక సిబ్బందికి వేతనాన్ని పెంచాలని కోరుతూ.. ఆసుపత్రి ఆర్ఎమ్ఓ చందూలాల్‌కు వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వాసుపత్రుల్లో.. సెక్యూరిటీ, సూపర్వైజర్, పారిశుద్ధ్య కార్మికులు ఏళ్ల తరబడి వెట్టి చాకిరికి గురవుతున్నారని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ నివేదికను వెంటనే సవరించి.. కార్మికుల కనీస వేతనాన్ని రూ.19 వేలకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్, సీపీఐ పట్టణ కార్యదర్శి శోభన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Ts Lockdown: రాష్ట్రంలో లాక్డౌన్ ఇక ఉండదా? అయితే వాట్ నెక్స్ట్