యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఐఎంఎల్ నాయకులు ధర్నా చేపట్టారు. యాదాద్రి భువనగిరిని కరవు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలోపు రైతురుణాన్ని ఏకకాలంలో మాఫీ చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
ఇవీ చూడండి:'ఇక నోటీసులు లేవు... కూలగొట్టుడే'