ETV Bharat / state

ఫోటోగ్రఫీలో రాణిస్తున్న మహిళ... ప్రోత్సాహం భర్తదే - మహిళా ఫోటోగ్రాఫర్​ శారద

ఫోటోగ్రాఫర్ అనగానే మగవారే గుర్తుకు వస్తారు. ఈ వృత్తిలో పురుషులే కాకుండా ఆడవారు కూడా రాణిస్తున్నారు. మహిళలు కుటుంబ బాధ్యతలు, వంటింటికే పరిమితం కాకుండా కెమెరా అనే ఆయుధంతో... కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. మహిళ తలుచుకుంటే ఏరంగంలోనైనా విజయం సాధించగలమని నిరూపిస్తున్నారు. ఫోటోగ్రాఫర్​గా కొనసాగిస్తూనే... రాష్ట్ర వ్యాప్తంగా మహిళ ఫోటోగ్రాఫర్లకు వర్క్ షాపులు నిర్వహిస్తూ, పలువురి ప్రశంసలు పొందుతూ ముందుకు వెళ్తున్నారు శారద.

women photographer success story at yadadri bhuvanagiri district
ఫోటోగ్రఫీలో రాణిస్తున్న మహిళ... ప్రోత్సాహం భర్తదే
author img

By

Published : Apr 12, 2021, 11:46 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన ఏశాల శారద చిన్నప్పటి నుంచే... ఏదైనా నేర్చుకోవాలనే తపనతో ఉండేవారు. పదవ తరగతితో పాటు టైలరింగ్ కూడా చేశారు. కొన్నాళ్లు మిషన్ కుట్టు పని చేశారు. ఆమె భర్త ఏశాల కృష్ణ 20 ఏళ్ళుగా మండలకేంద్రంలో "మమత" డిజిటల్ ఫోటో స్టూడియో నిర్వర్తిస్తున్నారు. కృష్ణ వృత్తిలో భాగంగా ఇతర ప్రాంతాలకు బయటకు వెళ్ళినప్పుడు, ఫోటో స్టూడియో తరచూ బంద్ చేసేవారు.

ఫోటోగ్రఫీలో రాణిస్తున్న మహిళ... ప్రోత్సాహం భర్తదే

ఆలోచనను ఆచరణలో పెట్టి..

అప్పుడే శారదకు ఒక ఆలోచన తట్టింది. తను కూడా ఈ ఫోటోగ్రఫీని నేర్చుకుని... భర్త లేని సందర్భాలలో స్టూడియో బాధ్యతను చూసుకోవచ్చు అనుకుంది. ఈ విషయాన్ని భర్తకు అర్థమయ్యేలా వివరించింది. అంగీకరించిన భర్త... ఫోటోగ్రఫీలో ఉన్న పద్ధతులు, మెలకువలు నేర్చుకొన్నారు. ఇప్పుడు ఆమె కూడా ఒక మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్​గా పై స్థాయికి చేరుకున్నారు. వాడకంలో ఉన్న పాస్ పోర్ట్ సైజు ఫోటోల దగ్గర నుంచి... ఆధునిక రంగంతో పోటీ పడుతున్న కెమెరాలతో సహా చక్కని ఫోటోలు తీస్తుంది. భర్తతో కలిసి బయట వివాహాది శుభకార్యాలకు, ఇతర ఫంక్షన్లకు హాజరవుతూ... ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. కంప్యూటర్ సహాయంతో ఆల్బమ్ డిజైన్లు, ఫోటోల గ్రాఫిక్స్​ను చేస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు.

రాష్ట్ర స్థాయిలో గుర్తింపు...

శారద నైపుణ్యాన్ని రాష్ట్ర ఫోటోగ్రఫీ యూనియన్ గుర్తించిoది. ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున రవీంద్రభారతిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డుతో ఆమెను సత్కరించారు. 2018లో తెలంగాణ ఫొటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమెను ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మండలాల్లో పర్యటిస్తూ ఫోటోగ్రఫీపై మహిళలకు అవగాహన కలిగిస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ ఫోటోగ్రాఫర్​లతో వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు.

పట్టుదల, ఓపిక ఉంటే మహిళలు ఏదైన సాధించగలరని ఏశాల శారద తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని... ఫోటోగ్రఫీ కూడా మంచి వృత్తి అని తెలిపారు. తన భర్త ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించానని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఓరుగల్లు‌లో కేటీఆర్ పర్యటన... అభివృద్ధికి శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.