యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్ద పాఠశాలకు చెందిన రావుల సైదమ్మ భర్త అంజయ్య 2005 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన మల్లె పోయిన బాలయ్య వద్ద రూ.34 వేలకు.. సర్వే నెంబర్ 57/1లో ఎకరం భూమిని సాదా కాగితం ద్వారా కొనుగోలు చేశారు. కొద్ది రోజుల క్రితం అంజయ్య మరణించాడు. అప్పటి నుంచి సైదమ్మ భూమిని సాగు చేసుకుంటున్నారు. తన భూమిని క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి పట్టా ఇప్పించాలని కోరుతూ 2018 సంవత్సరంలో సైదమ్మ తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంది.
మరొకరికి పట్టా
ఆ భూమిని 2017 లోనే సాదాబైనామా కింద మల్లె పోయిన బాలయ్యకు పట్టా చేశారు. భూమి అమ్మిన వ్యక్తే అక్రమంగా పట్టా చేయించుకున్నాడని ఆరోపిస్తూ గత ఆగస్టు 5న గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది సైదమ్మ. స్పందించిన పాలనాధికారి తహసీల్దార్‌ను క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికీ అధికారులు సర్వే చేయలేదని సైదమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడంలేదంటూ వాపోయారు. న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశారు.
ఇదీచూడండి: రైతు సమస్యలపై శాసనసభలో పోరాటం: సీఎల్పీ