ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో మంగళవారం నుంచి పూజా వేళల్లో మార్పులు చేసినట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలను దృష్టిలో ఉంచుకుని జూన్8 నుంచి ఆలయాన్ని ఉదయం 5.30 గంటలకు తెరిచి రాత్రి 8.00 గంటలకు మూసివేసేవారమని చెప్పారు. ప్రస్తుతం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున.. గతంలో మాదిరి ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో మొదలుకొని రాత్రి 9.30 గంటలకు స్వామి అమ్మవార్ల శయనోత్సవంతో ద్వార బంధనం చేయనున్నట్లు వెల్లడించారు.
నిత్యకైంకర్యాలు అన్ని యథావిధిగా పాత పద్ధతిలోనే కొనసాగుతాయని ఆలయ ఈఓ గీతారెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారి జన్మనక్షత్రం స్వాతి రోజున గంట ముందుగా స్వామి అమ్మవార్ల శతఘటాభిషేకం పూజలు, ప్రతి ఏకాదశి తిథి రోజున ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు లక్షపుష్పార్చన పూజలు కొనసాగుతాయని తెలిపారు. అదేవిధంగా పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో యథాప్రకారం కైంకర్యాలు జరిపిస్తామని వెల్లడించారు.
- ఇవీ చూడండి: తెదేపా బృందంపై దాడి... సీపీకి ఫిర్యాదు