ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవా మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలో అమ్మవారిని వివిధ రకాల తులసి దళాలు, పూలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఊంజల్ సేవ చేసుకున్నారు అర్చకులు. ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సేవ చేసుకున్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపండి: హైకోర్టు