ప్రజలు తెరాస పాలనతో విసిగిపోయి... భాజపా వైపు చూస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పట్టణ శివార్లలో నూతనంగా నిర్మించనున్న పార్టీ నూతన కార్యాలయం భూమి పూజకు ఆయన హాజరయ్యారు.
పార్టీ కార్యాలయాలు ప్రజా సమస్యలు తీర్చే నిలయాలుగా ఉంటాయని చెప్పుకొచ్చారు. భాజపా కార్యాలయ పునాది రాళ్లు.. సమీప రోజుల్లో తెరాస ప్రభుత్వానికి సమాధి రాళ్లవుతాయని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. జనవరి 1 నుంచి ప్రభుత్వ వైఫల్యాలపై వీధి పోరాటాలు చేస్తామన్నారు.
అనంతరం రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా... ప్రభుత్వం స్పందించడం లేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పరిధి పేరు చెప్పి కేసు స్వీకరించకపోవడమేనా అని ప్రశ్నించారు. శంషాబాద్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు.
ఇదీ చూడండి : 'నిర్భయ' దోషికి క్షమాభిక్ష వద్దు: దిల్లీ ప్రభుత్వం