కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని భాజపా మహిళా రాష్ట ఉపాధ్యక్షురాలు శోభారాణి డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మలరామారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె సందర్శించారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని రెండు నెలలైనా.. కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పంటను కొనుగొలు చేసి.. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
అనంతరం తుర్కపల్లి, బొమ్మలరామరం పీహెచ్సీలకు భాజపా ఆధ్వర్యంలో శోభారాణి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేశారు. కొవిడ్ మహమ్మారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.
ఇదీ చదవండి: Governor Tamilisai: కాలుష్య రహిత భూమికోసం సమష్టి కృషి చేద్దాం