ETV Bharat / state

'పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం' - యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని

ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలపై నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి యాదాద్రి జిల్లాలో అపూర్వ స్పందన వచ్చింది. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే రావాలని విద్యాశాఖ అధికారి చైతన్య జైని సూచించారు. పరీక్షలకు సంబంధించి అనేక సందేహాలను నివృత్తి చేశారు.

Yadadri Bhuvanagiri District Education Officer Chaitanya Jaini
'పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు'
author img

By

Published : Jun 5, 2020, 7:12 PM IST

కరోనా నేపథ్యంలో.. వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలు ఈనెల 8 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పరీక్షలకు సంబంధించి అనేక సందేహాలను యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని నివృత్తి చేశారు.

భౌతికదూరం తప్పనిసరి..

ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చింది. ఎక్కువగా పాత హాల్ టికెట్లు పనిచేస్తాయా, పరీక్ష కేంద్రాలు మారాయా, రవాణా సౌకర్యం ఏర్పాటుపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు డీఈఓ సమాధామిచ్చారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే రావాలని సూచించారు. భౌతికదూరం పాటించాలని ప్రతి గదిలో 10 నుంచి 12 మందిని బెంచ్​కు ఒకరు పరీక్ష రాసే విధంగా గదులను ఏర్పాటు చేశామని చైతన్య జైని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

ఇదీ చూడండి: పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.