కరోనా కట్టడిలో భాగంగా సమాజంలో ఎక్కువ మందితో సంబంధాలు కలిగి వివిధ రంగాల్లో పనిచేస్తున్న సూపర్ స్ప్రెడర్స్కు మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఉన్నత పాఠశాల ఆవరణలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని స్థానిక మున్సిపల్ ఛైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి ప్రారంభించారు.
ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా... వ్యాక్సిన్ ఆలస్యంగా కేంద్రానికి చేరడంతో సుమారు రెండున్నర గంటలు వేచి చూడాల్సి వచ్చింది. ఈ కార్యక్రమంలో మూడు మండలాలకు చెందిన 391 మంది టీకాలు తీసుకున్నారు. మండలంలోని జర్నలిస్ట్లు, పెట్రోల్ బంక్, ఫర్టిలైజర్ ఫెస్టిసైడ్ దుకాణాల్లో పనిచేసే సిబ్బందికి ఈ కేంద్రంలో టీకాలు ఇచ్చారు. ప్రభుత్వం దశలవారీగా అందరిక్ వ్యాక్సిన్ అందిస్తుందని మున్సిపల్ ఛైర్మన్ సావిత్రి మేఘారెడ్డి తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.
ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు