ETV Bharat / state

మార్చి 10న బీబీనగర్ ఎయిమ్స్ మొదటి ఆన్యువల్ డే

బీబీనగర్ ఎయిమ్స్‌లో స్పోర్ట్స్ కార్నివాల్ నిర్వహించారు. ఆటల పోటీల్లో అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్చి 10న ఎయిమ్స్ మొదటి ఆన్యువల్ డే నిర్వహించనున్నట్లు డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు.

Sports Carnival was organized at Bibinagar Aims
బీబీనగర్ ఎయిమ్స్‌లో స్పోర్ట్స్ కార్నివాల్‌‌ నిర్వహణ
author img

By

Published : Feb 27, 2021, 7:32 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌లో మార్చి 10న మొదటి ఆన్యువల్ డే నిర్వహిస్తున్నామని డైరెక్టర్ వికాస్ భాటియా వెల్లడించారు. ఇందుకోసం కళాశాల మ్యాగజైన్ సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాదిగా నిర్వహించిన కార్యక్రమాలు అందులో పొందుపర్చనున్నట్లు తెలిపారు.

ఎయిమ్స్‌లో స్పోర్ట్స్ కార్నివాల్ నిర్వహించారు. వైద్య విద్య అధ్యాపకులు, కళాశాల సిబ్బందికి, విద్యార్థులకు పోటీలు జరిగాయి. క్రికెట్, పరుగు పందెం, ఇండోర్ గేమ్స్ నిర్వహించామని భాటియా వెల్లడించారు. మ్యాగజైన్‌ని ముఖ్య అతిథి చేతుల మీదుగా మార్చి 10న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

గత 10 రోజులుగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. మొదటి, రెండో ఏడాది వైద్య విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. కొవిడ్ వల్ల అందరూ ఫిట్‌గా ఉన్నారని చెప్పారు.

ఇదీ చూడండి: పదేళ్ల తర్వాత భారత జిమ్నాస్టిక్స్​ సమాఖ్యకు గుర్తింపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.