లాక్ డౌన్ సమయాన్ని.. సొమ్ము చేసుకుందామని ఆశపడ్డ వ్యాపారి ఆటకట్టించారు యాదాద్రి జిల్లా పోలీసులు. ఆలేరు పట్టణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే ఎస్ఓటి పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి.. ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో భారీగా దాచిన మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ. 25,000లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు.. నలుగురు మృతి