యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అడ్డగూడూరు మండలం ఈటూరుకు సమీపంలో.. వేగంగా వచ్చిన ఓ ద్విచక్రవాహనం ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. బైక్ పైనున్న శ్రీనివాస్, వంశీలు తీవ్ర గాయాల పాలయ్యారు.
మరొక ఘటనలో..
చిర్రగూడూరు స్టేజీ సమీపంలో ఓ ఆటో అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆటో డ్రైవర్ మహేందర్‌తో పాటు అతని భార్య శిరీషకు స్వల్ప గాయలయ్యాయి. బైక్ పైనున్న యాకయ్య, ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ఆయిల్ ట్యాంకర్ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు మృతి