ETV Bharat / state

తుర్కపల్లిలో రెండు కరోనా కేసులు.. లాక్​డౌన్​ విధించుకున్న ప్రజలు! - తుర్కపల్లిలో లాక్​డౌన్​

తుర్కపల్లి మండల కేంద్రంలో రెండు కరోనా కేసులు నమోదు కావడం వల్ల మండల కేంద్రంలోని చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటిస్తున్నారు. జులై 18 నుంచి ఆగష్టు 5 వరకు నిబంధనలతో కూడిన లాక్​డౌన్​ పాటించాలని ప్రజలు తీర్మానించారు.

Self Lockdown in Yadadri District Thurkapally
తుర్కపల్లిలో రెండు కరోనా కేసులు.. లాక్​డౌన్​ విధించుకున్న ప్రజలు!
author img

By

Published : Jul 18, 2020, 8:05 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. మరిన్ని కేసులు విస్తరించకుండా మండల కేంద్రంలోని చిరు వ్యాపారస్థులు స్వచ్ఛందంగా లాక్​డౌన్ పాటిస్తున్నారు. మరిన్ని కరోనా కేసులు పెరగకుండా జులై18 నుంచి ఆగష్టు 5 వరకు నిబంధనలతో కూడిన లాక్​డౌన్ పాటించాలని తుర్కపల్లి ప్రజలు తీర్మానించుకున్నారు. జులై 18, 19న పూర్తి లాక్​డౌన్​, 20 నుంచి ఆగష్టు 5 వరకు నిబంధనలతో కూడిన లాక్​డౌన్​ అమలు చేయనున్నట్టు మండల అధికారులు, పెద్దలు తెలిపారు.

లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.10వేల జరిమాన విధించనున్నట్టు షరతు పెట్టారు. మండలంలోని డాక్యుమెంట్ రైటర్స్ జులై18 నుంచి 26 వరకు స్వచ్ఛంధంగా లాక్​డౌన్ పాటించనున్నట్టు తీర్మాన పత్రాన్ని ఎమ్మార్వో సలిముద్దీన్​కి అందజేశారు. కరోనా భయంతో ప్రజలెవరు బయటకి రావటం లేదు. నిత్యం రద్దీ గా ఉండే తుర్కపల్లి మండల కేంద్రం లాక్​డౌన్​ వల్ల జన సంచారం లేక బోసిపోయింది. అందరూ స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేసి, లాక్​డౌన్ పాటిస్తున్నారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.