యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఇండియా మిషన్ హై స్కూల్లో ఓ విద్యార్థి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నందుకు స్కూల్ లోకి అనుమతించలేదు. విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వాములు ఇండియా మిషన్ స్కూల్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. ప్రధానోపాధ్యాయుడు ఇప్పుడే భోజనం చేసి వస్తానని చెప్పి బయటికి వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడం వల్ల అయ్యప్ప స్వాములు మధ్యాహ్నం నుంచి స్కూల్ బయటే ఆందోళన కొనసాగించారు.
సాయంత్రం 5 గంటలకు స్కూల్ యాజమాన్యం అయ్యప్ప స్వాములకు, విద్యార్థి తండ్రికి క్షమాపణ చెప్పటంతో స్వాములు ఆందోళన విరమించారు. మరోవైపు అదే సమయంలో పాఠశాల ఫీజు చెల్లించలేదని ఓ విద్యార్థితో యాజమాన్యం అసభ్యంగా మాట్లాడారంటూ విద్యార్థి తల్లి ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజు చెల్లించకుంటే అసభ్యంగా మాట్లాడుతారా? అంటూ ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించింది. పోలీసులు విద్యార్థిని తల్లిని, వారి బంధువులను సముదాయించి అక్కడి నుండి పంపించివేశారు.
ఇవీ చూడండి: కీలక పదవికి జైలు నుంచే ఎన్నికైన లాలూ