ఆరోగ్య తెలంగాణ కోసం పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలూ పెద్దఎత్తున భాగస్వాములు కావాలని మున్సిపల్ ఛైర్మన్ శంకరయ్య అన్నారు. కరోనాతో పాటు ఇతర వ్యాధులపైనా అప్రమత్తంగా ఉండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పురపాలకశాఖ పరిధిలో మూడవ వార్డులో తడి, పొడి చెత్తల కోసం వేర్వేరుగా బుట్టలు పంపిణి చేశారు.
నిల్వనీటిని తొలగించాలి..
నివాసంతో పాటు పరిసరాల్లోని నిల్వనీటిని తొలగించి, పూలకుండీలను శుభ్రపరచాలని శంకరయ్య ప్రజలకు సూచించారు. దోమల నివారణ కోసం మందులను చల్లారు. ఈకార్యక్రమంలో రాములు, పట్టణ పీఏసీ వైస్ ఛైర్మన్ చంద్రకళ, తెరాస పట్టణ అధ్యక్షులు వెంకటేశ్, మల్లేశ్, మాధవరెడ్డి, అంజయ్య వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు