హాజీపూర్ బాధిత కుటుంబాలకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆర్థిక సాయం అందించారు. మనీషా, కల్పన కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల చెక్కును అందజేశారు. నేరేడ్ మెట్‌లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు మహేశ్ భగవత్. కుటుంబంలో అర్హులైన వారికి పొరుగుసేవల ద్వారా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
గత నెల 27న హాజీపూర్ గ్రామాన్ని సందర్శించి మరో బాధితురాలు శ్రావణి కుటుంబ సభ్యులకు 25 వేల రూపాయల ఆర్థికసాయం అందించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు... రహదారి సౌకర్యం కల్పిస్తామని మహేశ్ భగవత్ హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల దృష్టికి తీసుకురావాలని సీపీ గ్రామస్థులకు సూచించారు.
![MAHESH BHAGAVATH](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3191135_police.jpg)
ఇవీ చూడండి : సీపీఐ రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తం