యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పట్టపగలే చోరి జరిగింది. శాంతినగర్‌కు చెందిన దయ్యాల బాలరాజు ఇంటికి తాళం వేసి బయట పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూస్తే... తాళం పగులగొట్టి ఉండటం గమనించాడు. లోపలికి వెళ్లి పరిశీలించగా.... బీరువాలో ఉన్న ఎనభై వేల నగదుతోపాటు ఇరవై వేల విలువ గల వెండిపట్టీలు చోరికి గురైనట్లు గమనించాడు. పక్కనే ఉన్న కొవ్వూరి గీత ఇంట్లోనూ ఇదేపరిస్థితి. తాళం పగులగొట్టి దాదాపు ఐదువేల రూపాయలు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి:8 ఏళ్ల బాలికపై అత్యాచారం