యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నుంచి మోత్కూరు వరకు సూచిక, రక్షణ బోర్డులు ఏర్పాటు చేయకుండా కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేపట్టడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి వాహనదారులు బలవ్వాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
కొండాపురం, ముత్తి రెడ్డి గూడెం, కాటేపల్లి మధ్యలో జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనుల వద్ద ఎలాంటి రక్షణ బోర్డులు లేవు. ముత్తిరెడ్డి గూడెం, కాటపల్లిలో చేపడుతున్న వంతెనల నిర్మాణాల దగ్గర కూడా ఎలాంటి సూచికలు ఏర్పాటుచేయపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు, వాహనదారులు భయాందోళనలు వ్యక్తం చేశారు. అధికారులు రక్షణ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితుల్లో మనోధైర్యం నింపిన పువ్వాడ