యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరాయి. స్థానిక విపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళనకు సంపూర్ణ మద్దతు, సంఘీభావం ప్రకటించాయి.
కరోనా నేపథ్యంలో నాలుగు మాసాలుగా చేనేత కుటుంబాలకు ఉపాధి కొరవడిందన్నారు. పెద్ద ఎత్తున పేరుకుపోయిన వస్త్రాలు ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని చేనేత ఐక్య కార్యాచరణ సమితి విజ్ఞప్తి చేసింది. 40 శాతం నూలు రాయితీని ప్రతి చేనేత కుటుంబానికి నెలకోసారి నేరుగా అందించాలని కోరారు. ప్రతి కార్మిక కుంటుంబానికి రూ.8 వేల రూపాయల చొప్పున ఆరు మాసాలపాటు భృతి ఇవ్వాలని అభ్యర్థించారు. చేనేత వృత్తికి భద్రత, భరోసా కల్పించాలని ఐకాస ప్రతినిధులు కోరారు.
ఇదీ చూడండి : ఆరేళ్ల బాలుడు ఆస్పత్రిలో స్ట్రెచర్ తోస్తూ...