ETV Bharat / state

కూలీ చేసుకుని కూడబెట్టిన డబ్బును ఎలుకలు కొట్టేశాయి! - rats torned currency worth five thousand rupees in yadadri bhuvanagiri district

కట్టుకున్న వాడు కాలం చేయడంతో ఏళ్ల తరబడి ఒంటరిగా జీవిస్తోంది ఆ వృద్ధురాలు. ఎవరిపై ఆధారపడకుండా.. ఎవరి ముందు చేయి చాచకుండా కష్టపడి కూలీ చేసుకుంటూ బతుకీడుస్తోంది. అలా కూలీ చేసుకుని రూ.5వేల వరకు నగదు పోగు చేసింది. ఆ డబ్బంతా బీరువాలో భద్రంగా దాచుకుంది. అవసరం పడి ఓ రోజు.. ఆ డబ్బు తీసుకుందామని బీరువా తెరవగా.. రూ.5వేల విలువ గల నోట్లన్ని చిరిగిపోయాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పడ్డ కష్టమంతా.. ఎలుకలు.. బూడిదలో పోసిన పన్నీరు చేశాయని ఆ మహిళ వాపోయింది.

కూలీ చేసుకుని కూడబెట్టిన డబ్బును కొట్టిన ఎలుకలు

author img

By

Published : Jul 31, 2021, 12:37 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు మండలం లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన కొలుగూరి లక్ష్మీ.. భర్తను కోల్పోయి చాలా ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తోంది. ఎవరిపై ఆధారపడకుండా కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అలా కూలీకి వెళ్తూ రూ.5వేలు కూడబెట్టింది. ఆ డబ్బును బీరువాలో దాచుకుంది.

మూణ్నెళ్ల తర్వాత అవసరం పడి.. డబ్బు తీసుకుందామని ఆ వృద్ధురాలు బీరువా తెరిచింది. తాను దాచుకున్న ఐదు వేల రూపాయల విలువ గల నోట్లను ఎలుకలు కొరికేశాయి. బీరువాలోని దుస్తులను కూడా చించేశాయి. ఆ నోట్లను ఇరుగుపొరుగుకు చూపించగా.. అవి చెల్లవని వారు చెప్పారు. తాను ఎంతో కష్టపడి.. ఎండనకా.. వాననకా.. కూలీ చేసి ఆ డబ్బు కూడబెట్టానని.. ఇప్పుడు తన కష్టమంతా ఎలుకలు మట్టిపాలు చేశాయని వాపోయారు. అధికారులు స్పందించి.. ఆ నోట్లను బ్యాంకులో మార్పిడి చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతోంది.

గతంలో రూ.2 లక్షలు

గతంలో మహబూబాబాద్ జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ రైతు తన కడుపులో పుట్టిన కణతి తొలగించుకునేందుకు సర్జరీ కోసం అప్పు చేసి పోగు చేసిన రూ.2 లక్షలు ఎలుకలు కొట్టాయి. ఆ వ్యక్తి సమస్యపై ఈటీవీ భారత్​ ప్రచురించిన కథనం మంత్రి సత్యవతి రాఠోడ్ దృష్టికి వెళ్లగా.. ఆమె స్పందించారు. డబ్బుతో పాటు రైతుకు మెరుగైన వైద్యం అందేలా సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.