కరోనా కట్టడిలో ముందు వరసలో ఉండి పోరాటం చేస్తున్న మున్సిపాలిటీ సిబ్బందికి 'ప్యూర్ స్వచ్ఛంద సంస్థ' బియ్యం, నిత్యవసరాలను అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో 50 మంది మున్సిపాలిటీ సిబ్బందికి 25 కిలోల బియ్యం, 9 రకాల నిత్యావసర సరుకులు అందించారు.
ఫ్లోరిడా దేశంలో ఉన్న ప్రవాస భారతీయుడు 'ప్యూర్' ఫౌండర్ శైల తాళ్లూరి ఆర్థిక సహాకారంతో... స్థానిక అంబేడ్కర్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ఫౌండర్ అరుణ కొంగరి బియ్యం, నిత్యావసర సరుకులను అందించారని తెలిపారు. మున్సిపాలిటీ సిబ్బందికి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆదుకోవడం అభిందనీయమని.. ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ డాక్టర్ లక్ష్మీ నర్సింహారెడ్డి అన్నారు.