ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బందికి కరోనా సోకిన దృష్ట్యా భక్తులకు అనుమతి లేకుండా ఏకాంత సేవలు చేశారు.
భక్తులకు ఆలయ అధికారులు లఘు దర్శనం కల్పిస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా సిబ్బంది మంగళవారం ఆలయం పరిసర ప్రాంతాలన్నీ శానిటైజ్ చేశారు.
ఇదీ చూడండి: యాదాద్రి ఆలయంలో మరో 10 మంది ఉద్యోగులకు కరోనా