యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 35వ వార్డులో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ... 9 గంటల తర్వాత నుంచి ఓటర్లు కేంద్రాలకు తరలి వస్తున్నారు.
ప్రశాంతంగా ఓటింగ్... వినియోగించుకుంటున్న ఓటర్లు ఓటర్ల రాకతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విలీన గ్రామాలతో కలిపి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
ఇదీ చూడండి: పుర పోలింగ్‌కు తరలివస్తోన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు