ETV Bharat / state

Regional Ring Road Alignment Dispute : 'రైతు చేతులకు బేడీలా.. తెలంగాణ ఇవాళ కన్నీరు పెడుతోంది' - Komati Reddy response to outer ring road dispute

Regional Ring Road Dispute police put on bedis for farmers : రీజనల్​ రింగ్​ రోడ్డు అలైన్డ్​ మెంట్​ను మార్చాలని గత నెల 30న మంత్రి జగదీశ్​ రెడ్డి కాన్వాయ్​ను అడ్డుకున్న రైతులను ఇవాళ రిమాండ్​ అనంతరం భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో రైతులకు సంకెళ్లు వేసి పోలీసులు కోర్టుకు తీసుకురావడంతో స్థానికులు ఆందోళన చేశారు. రైతుల పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించడం సరైన పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్​ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి సైతం స్పందించారు. ఆయన ఏమన్నారంటే..?

Regional Ring Road Alignment Dispute
Regional Ring Road Alignment Dispute
author img

By

Published : Jun 13, 2023, 8:21 PM IST

Regional Ring Road Dispute latest news : రీజినల్ రింగ్ రోడ్డు అలైన్డ్ మెంట్​ను మార్చాలని గత నెల 30వ తేదీన కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన రైతులను ఇవాళ పద్నాలుగు రోజుల రిమాండ్ అనంతరం భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. అదే రోజు మంత్రి జగదీశ్​ రెడ్డి కాన్వాయ్​ను కలెక్టరేట్ వద్ద రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతుల చేతులకు సంకెళ్లు వేసి ఇవాళ పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. దీనిపై తీవ్రంగా ఆగ్రహించిన బాధిత కుంటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. పద్నాలుగు రోజులుగా వారిని నిర్భందించడమే కాకుండా సంకెళ్లు వేయటం బాధకరమని రైతులు ఆందోళన చేశారు. రిమాండ్​లో ఉన్న రైతులను ఇవాళ నల్గొండ జిల్లా జైలు నుంచి యాదాద్రి భువనగిరి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రైతులు వారి కుటుంబీకులను కోర్టు ఆవరణలో కలుసుకోవడంతో కన్నీరు పెట్టుకున్నారు.

ప్రభుత్వం అన్యాయంగా తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా.. బాధిత రైతులకు సోమవారమే బెయిల్​ మంజూరు కాగా.. ఇవాళ న్యాయవాదుల పూచీకత్తులు సమర్పించారు. విడుదల కోసం బెయిల్​ రిలీజ్​ కాపీలను నల్గొండ జైలు అధికారులకు అందించనున్నారు.

Outer Ring Road Dispute Komati Reddy Venkata Reddy Comments : ప్రాంతీయ రింగ్‌ రోడ్డు భూసేకరణ విషయంలో వ్యతిరేకించిన రైతులకు పోలీసులు బేడీలు వేయడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములు పోతున్నాయంటూ భువనగిరి, రాయగిరి ప్రాంతాల రైతులు ఆందోళన చేస్తుంటే వారిని అరెస్టు చేసి.. కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో కూడా సంకెళ్లు వేయడంపై ఎంపీ తీవ్రంగా స్పందించారు. భూసేకరణ పేరుతో బడుగు బలహీన, దళితుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని ధ్వజమెత్తారు. వారసత్వంగా వస్తున్న కొద్దిపాటి భూమి పోతుందన్న బాధతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. రైతులకు బేడీలు వేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

"రైతులను శాంతి యుతంగా ధర్నా చేస్తుంటే ఇవాళ రైతులను అరెస్టు చేయడం సరికాదు. ఇవాళ అక్కడ ధర్నాలు చేస్తున్న రైతులకు కేవలం ఒకటో రెండో ఎకరాలు ఉన్న వారే.. అందుకే వారి భూములు పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిని ఇవాళ కోర్టుకు తీసుకొచ్చే సమయంలో బేడీలు వేయడం చూస్తే చాలా బాధాకరం. ఇవాళ తెలంగాణ ప్రజలు ఈ న్యూస్​ చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బేడీలు వేసిన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వారిపై ఉన్న కేసులు కూడా కొట్టేయాలి."- కోమటి రెడ్డి వెంకట రెడ్డి, భువనగిరి ఎంపీ

'రైతు చేతులకు బేడీలు.. తెలంగాణ ఇవాళ కన్నీరు పెడుతోంది'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.