ETV Bharat / state

పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

author img

By

Published : Oct 21, 2019, 7:57 PM IST

పోలీసు అమరవీరులను స్మరిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ హెడ్​క్వార్టర్స్​లో ఇండియన్ రెడ్​ క్రాస్ సొసైటీ సహకారంతో పోలీసులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ హెడ్​క్వార్టర్స్​లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్​ రెడ్​ క్రాస్ సొసైటీ సహకారంతో పోలీసులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా డీసీపీ నారాయణరెడ్డి ప్రారంభించగా.. ఏసీపీ భుజంగరావు, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పోలీసులు రక్తదానం చేశారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్​ సందర్శించి పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ప్రజలందరూ గుర్తుంచుకోవాలన్నారు.

పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

ఇదీ చదవండిః పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన కలెక్టర్

TG_NLG_62_21_POLICE_BLOODDONATIONCAMP_AB_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని జిల్లా డి సి పి నారాయణ రెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. జిల్లా డిసిపి నారాయణరెడ్డి తోపాటు ఏసిపి భుజంగరావు జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు,పోలీసులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా డిసిపి నారాయణరెడ్డి మాట్లాడుతూ పోలీసులు నక్సల్స్ ను, టెర్రరిస్టుల తోనూ ఇంటా, బయట సవాళ్లను ఎదుర్కొంటున్నారని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సహచర పోలీసులను గుర్తు చేసుకొని వారికి నివాళులు అర్పించారు. మెగా రక్త దాన శిబిరాన్ని రక్తదాన జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సందర్శించారు. పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధినిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులు కుటుంబాలకు మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు పోలీసుల అవసరం చాలా ఉందన్నారు. రక్త దాన శిబిరంలో 300 వందల కు పైగా రక్తదానం చేయడానికి పోలీసులు, యువకులు, ఔత్సాహికులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. బైట్ : నారాయణ రెడ్డి (డిసిపి, యాదాద్రి భువనగిరి జిల్లా ) బైట్ : అనిత రామచంద్రన్ (కలెక్టర్, యాదాద్రి భువనగిరి )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.