ETV Bharat / state

కరోనాతో మృతి.. అంత్యక్రియలు జరిపిన గ్రామ సిబ్బంది

కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తికి గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు జరిపి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పల్లెర్ల గ్రామంలో జరిగింది.

Corona deaths, pallerla village, yadadri bhuvanagiri

author img

By

Published : Apr 27, 2021, 6:11 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని పల్లెర్ల గ్రామంలో కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తికి.. గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు జరిపి దాతృత్వాన్ని చాటుకున్నారు.

45ఏళ్ల గుర్రం యాదగిరి 5 రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. కరోనా లక్షణాలు కనిపించటం వల్ల ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. తన స్వగ్రామంలో హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటూ.. ఈరోజు ఉదయం మరణించాడని సర్పంచ్​ నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.

ఎస్సై ఇద్రిస్ అలీ, ఆర్​ఐ యాదగిరి పర్యవేక్షణలో సర్పంచ్​, తన సిబ్బంది.. గ్రామ పంచాయతీ ట్రాక్టర్​లో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. డాక్టర్ ప్రణీశ సూచనతో సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్​ఎం, గ్రామపంచాయతీ సిబ్బంది, వీఆర్​ఏ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ముగిసిన మినీ పురపోరు ఎన్నికల ప్రచారం... 30న పోలింగ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.