ETV Bharat / state

కరోనాతో చితికిపోయాం... ఆదుకోండి: నేతన్నల వేడుకోలు - యాదాద్రి భువనగిరి తాజా వార్త

లాక్​డౌన్​ కారణంగా మగ్గాన్నే నమ్ముకుని జీవిస్తున్న తమకు రోజు గడవడమే కష్టంగా మారిందని పద్మశాలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భువనగిరిలోని పద్మశాలీ భవన్​లో నేతన్నలు నిరసన దీక్ష నిర్వహించారు.

padmashalis-protest-in-bhuvanagiri-padmashali-bhavan
తమనాదుకోమంటూ భువనగిరిలో నేతన్న నిరసన
author img

By

Published : Jun 7, 2020, 4:48 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని పద్మశాలీ భవన్​లో నేతన్నలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పట్టణంలోని అన్ని పార్టీలు సంఘీభావం తెలిపాయి. లాక్​డౌన్ సమయంలో మగ్గాన్ని నమ్ముకుని జీవిస్తున్న చేనేత కుటుంబాలకు రోజు గడవడమే గగనంగా మారిందని పద్మశాలీలు ఆవేదన వ్యక్తం చేశారు.

మోదీ ప్రకటించిన ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీలో చేనేతలకు, కులవృత్తులకు ఎంత కేటాయించారో ప్రకటించాలని కాంగ్రెస్ నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. చేనేత కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెలకు 7500 రూపాయలు చేనేత కార్మికులకు భృతి ఇవ్వాలని సీపీఎం నాయకులు జహంగీర్ ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.